గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లది ఓ సక్సెస్ ఫుల్ ప్రేమ కథ. నిజంగా వీరి జంట కాస్త డిఫరెంట్. తన పర్సనల్ లైఫ్ గురించి చాలా సందర్భాల్లో ఓపెన్ అయ్యారు ప్రియాంక. కొన్ని విషయాలు బాగా పర్సనల్ అయినప్పటికీ ప్రియాంక ఆనందాన్ని చూసి మురిసిపోయారు ఆమె అభిమానులు. సంతోషం ఏదైనా అభిమానులతో పంచుకోవడంలో తప్పులేదన్నారు. నిక్ తో తన జీవితం ఓ అద్భుతమైన ప్రయాణం అంటూ చెప్పుకొస్తోంది ఈ  టాలెంటెడ్ లేడీ. ఈ కపుల్ ఏం చేసినా డిఫరెంట్ గా ...సరికొత్తగా.. అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ మ‌ధ్యన ఒక ఇంట‌ర్వ్యూలో నిక్‌తో ఎంత‌మంది కుదిరితే అంత‌మంది పిల్ల‌ల‌ను క‌నాల‌నుంద‌ని షాక్ ఇచ్చింది.

అయితే తాజాగా మరో న్యూస్ తో ప్రేక్షకుల్ని మరింత ఆశ్చర్యపరిచింది ఈ జంట. మొత్తానికి అమెరికా కోడలు అనిపించుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...?? వైన్ బాటిల్ తో దర్శనమిచ్చింది ఈ గ్లోబల్ బ్యూటీ. భారతీయ సంప్రదాయం ఒప్పుకోని వాస్తవం ఇది. కానీ ఈ వైన్ బాటిల్ స్వయంగా నా భర్తే నాకు కొనిచ్చారంటూ తెగ సంతోష పడుతూ తన ఆనందాన్ని ఇలా షేర్ చేసుకుంది ఈ భార్యమణి. ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన `ది వైట్ టైగర్` నెట్ ఫ్లిక్స్ లో విడుదల సందర్భంగా ఫుల్ ఖుషీగా ఉంది ఈ జంట. ఈ మూవీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. గత రెండు రోజులుగా ఆన్ లైన్ లో ఈ సినిమా ప్రచారం మామూలుగా లేదు. రిలీజ్ అనంతరం ఈ చిత్రం  సూపర్ టాక్ ను తెచ్చుకుంది.

ఈ సంతోషంలో ఈ జంట మత్తెక్కించే వార్త చెప్పింది. ది వైట్ టైగర్ చిత్రం విడుదల వేడుకల్లో భాగంగా నిక్ తన సతీమణి ప్రియాంక చోప్రాకు  వైన్ బాటిల్ ను అందించాడట... ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ ఫోటోని స్వయంగా షేర్ చేసి...అత్యుత్తమ భర్త నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను..` అని తన మనసులోని వ్యాఖ్యలను జోడించింది. నిక్ ని - వైన్ ని కూడా ప్రేమిస్తున్నానని ప్రియాంక  చెప్పుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె వైన్ బాటిల్ పట్టుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. మా హీరోయిన్ ఫుల్ డిఫరెంట్... తాను ఏం చేసినా సెన్సేషనల్ అంటున్నారు ప్రియాంక అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: