ఇతర భాషల్లో ఏమో కానీ తెలుగు లో బిగ్ బాస్ షో ప్రాభవం చాలానే ఉంది.. ఈ షో లో పాల్గొన్న వారంతా ఎంతోకొంత బిగ్ బాస్ పేరు చెప్పుకుని ఎంతోకొంత వెనకేసుకుంటున్నారు.. షో ద్వారా వచ్చే డబ్బులు ఒక ఎత్తు అయితే షో తర్వాత వచ్చే అవకాశాలు మరొక ఎత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 లో పాల్గొన్న చాలామంది పార్టిసిపెంట్స్ ఇప్పుడు మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు..  ఇక ఈ  షో ద్వారా పాపులర్ అయినా అఖిల్ , మోనాల్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికి తెలిసిందే. వీరిద్దరూ హౌస్ లో ఉన్నంత సేపు ఎంత ప్రేమగా ఉన్నారో, బయట కూడా అలాగే ఉన్నారని వారి సోషల్ మీడియా లో పెట్టె ఫోటోలను చూస్తే తెలుస్తుంది..

కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా పేరు దక్కించుకున్న మోనాల్ బిగ్ బాస్ షో ద్వారానే ఆమెకు ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. అంతకుముందు మోనాల్ అంటే జస్ట్ హీరోయిన్.. కానీ ఇప్పడు మోనాల్ అంటే పెద్ద సెలబ్రిటీ.. అఖిల్ తో ఫ్రెండ్షిప్ ఆమెకు ప్లస్ అయ్యింది.. అఖిల్ ఫాలోయింగ్ అంతా కూడా ఈమెను ఫాలో అవడం మొదలుపెట్టారు.  అయితే తమ వ్యవహార శైలితో హౌస్ తో పాటు బయట కూడా హాట్ టాపిక్ అయ్యారు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్. బయట కూడా రచ్చ చేస్తోందీ జంట. ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్‌లో ముద్దులిచ్చుకుని మరోసారి హైలైట్ అయ్యారు. హోస్ట్ అక్కినేని నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం గురించే మాట్లాడుకునేవారు.

దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ తరచూ హైలైట్ అయ్యేవారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు.బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.బిగ్ బాస్ షో వల్ల ఎంతగానో పాపులర్ అయ్యారు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్. దీంతో వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరినీ జంటగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో వీళ్లిద్దరూ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్.. అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: