టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఒక ఫ్రెండ్ సృష్టించారు డైరెక్టర్ సందీప్ వంగా. 2017 లో వచ్చిన సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ను ఓవర్నైట్ స్టార్ ను చేసింది ఈ సినిమా. లవ్ స్టోరీ కథాంశంతో రా అండ్ రస్టిక్ గా వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగు లవ్ స్టోరీ మూవీస్ లో ప్రత్యేక స్థానాన్ని ని సంపాదించుకుంది. ఇదే సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ తో తెరకెక్కించగా అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. షాహిద్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం వసూళ్ల వరద పారించింది.

దీంతో సందీప్ వంగా తర్వాతి సినిమాపై ఒక్క తెలుగు ఆడియన్స్ లోనే కాక హిందీ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈలోగా హిందీలో కబీర్ సింగ్ మంచి విజయం సాధించడం వల్ల బాలీవుడ్ నుండి సందీప్ కు బడా ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగా రణ్ బీర్ కపూర్ తో " యానిమల్ " అనే సినిమా అనౌన్స్ చేశాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్‌ వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్‌ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన తండ్రిగా సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌, భార్యగా పరిణితి చోప్రా నటిస్తున్నారు. ఇలా బిగ్ స్టార్‌ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా సందీప్ స్టైల్‌లోనే రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో సందీప్ వంగా ఎలాంటి విజయాన్ని ఎందుకు ఉంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: