‘క్రాక్’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది శృతి హాసన్. ఆమె లుక్ తో పాటు ఆమె నటన కూడ ‘క్రాక్’ విజయానికి కీలకంగా మారింది. త్వరలో కోలీవుడ్ లో విడుదల కాబోతున్న విజయ్ సేతుపతి తో నటించిన మూవీ కూడ హిట్ అయితే మళ్ళీ శృతి బిజీ హీరోయిన్ గా మారే ఆస్కారం ఉంది.


ఈ నేపధ్యంలో ఈ బ్యూటీ ఈమధ్య తన ఇన్ ష్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో ఛాట్ చేసింది. చాల కాలం తరువాత ఈమె సోషల్ మీడియాలోకి మళ్ళీ రావడంతో అభిమానులు చాల యాక్టివ్ గా ఆమెతో ఈ ఛాట్ లో పాల్గొని అనేక చిలిపి ప్రశ్నలు వేసారు. ఫ్యాన్స్ తో జరిగిన ఈ ఇంటరాక్షన్లో ‘ట్రూ ఆర్ ఫాల్స్’ సెక్షన్ నడిపింది శృతి.


ఈ సందర్భంగా అభిమానులు ఆమె జీవితానికి సంబంధించిన చాలా ప్రశ్నలు అడిగారు. వారిలో ఒక అభిమాని శృతి ప్రేమ గురించి ఆరాతీసి ఆమెను ఇరుకున పెడదామని ప్రయత్నించి ‘మీరు ప్రేమలో ఉన్నారా?’ అంటూ అడిగిన ప్రశ్నకు ‘ట్రూ.. ఐ గెస్’ అన్న సమాధానం ఇచ్చింది. దీనితో ప్రస్తుతం శృతి లేటెస్ట్ గా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు అంటూ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చర్చలు జరుగుతున్నాయి.


గతంలో శృతి హాసన్ ఇటాలియన్ సంగీత కళాకారుడు మైఖేల్ కోర్సలేతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆతరువాత వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఒక విధంగా శ్రుతికి ఉన్న సమర్థతకు ఈ లివింగ్ రిలేషన్ షిప్ వ్యవహారం లేకుండా ఉంటే శృతి హాసన్ ఈపాటికే దక్షిణాదిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకునేది. ఇప్పుడిప్పుడే ఆమె కెరియర్ మళ్ళీ ట్రాక్ లో పడుతున్న పరిస్థితిలో మళ్ళీ ఆమె ప్రేమ గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. ఈ ఛాటింగ్ లో మరొక అభిమాని శృతి మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రశ్నిస్తూ  మీ మాజీ ప్రియుడిని ద్వేషిస్తున్నారా? అని అడగ్గా ఆమె అలాంటి ద్వేషాలు తనకు లేవు అంటూ సమాధానం ఇచ్చింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: