ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన సినిమా మాస్టర్. ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆడ్రియా హీరోయిన్స్ గా నటించారు. సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా టాక్ ఎలా ఉన్నా వసూళ్లతో మాత్రం అదరగొడుతుంది. తెలుగులో కూడా మాస్టర్ మంచి కలక్షన్స్ రాబట్టింది. అంతేకాదు తెలుగులో విజయ్ కు ఈ సినిమాతో మరింత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇక థియేటర్ లలో సందడి చేస్తున్నా సరే ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సినిమాను ఫిబ్రవరి 12న ఓటిటి లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ ఫ్యాన్స్ మాస్టర్ ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రేసులో ఉన్న మాస్టర్ మరోసారి ఈ సినిమాతో విజయ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సినిమాలో విజయ్ స్టైల్, యాక్షన్ ఫ్యాన్స్ కోరుకునేట్టుగా డైరక్టర్ సూపర్ గా తెరకెక్కించాడు. అందుకే కథ, కథనాలు ఎలా ఉన్నా సినిమాను కమర్షియల్ గా హిట్ చేశారు.

థియేటర్లలో సూపర్ హిట్టైన మాస్టర్ సినిమా ఓటిటిలో కూడా అదే దూకుడు చూపిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే పొంగల్ రేసులో దిగిన రవితేజ క్రాక్ సూపర్ హిట్ కాగా ఆ సినిమాను కూడా ఆహా ఓటిటిలో ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు. క్రాక్ తో ఆహా ఓటిటి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటే.. మాస్టర్ తో అమేజాన్ ప్రైం సందడి చేయబోతుంది. మాస్టర్ హిట్ టాక్ రాకపోయినా సరే విజయ్ మరోసారి కలక్షన్స్ తో తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశారు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: