ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ సినిమాలంటే ఆడియెన్స్ కు పండుగే. ఈ సినిమాలను సకుటుంబ సమేతంగా చూడగలగడం ఒక కారణం. కడుపుబ్బా నవ్వుకోగలగడం మరో కారణం. ప్రతి ఏడాది బోలెడన్ని సినిమాలతో అల్లరి నరేష్ ప్రేక్షకులని అలరించేందుకు వచ్చేవాడు.

ఎందుకో తెలీదు గాని అల్లరి నరేష్ లో ఈ వేగం చాలావరకు తగ్గింది. మధ్యలో సపోర్టింగ్ రోల్ ను కూడా ట్రై చేశాడు. మహేష్ బాబు "మహర్షి"లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అల్లరి నరేష్ ప్రయత్నించాడు. నరేష్ రోల్ కు మంచి గుర్తింపు రావడంతో మళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. "బంగారు బుల్లోడు"గా ఆడియెన్స్ ను పలకరించడానికి ముందుకు వచ్చాడు.

అసలీ బంగారు బుల్లోడు కథేంటి? క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. నరేష్ ఇందులో భవాని ప్రసాద్ పాత్రలో కనిపించాడు. భవాని ప్రసాద్ బ్యాంకు ఉద్యోగి. గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. తన కుటుంబంలోని సమస్యలకు అమ్మవారి నగలకు లింక్ ఉందని తన తాత ద్వారా తెలుసుకుంటాడు.

తాత చేసిన పొరపాట్ల వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకుని ఆ పొరపాట్లను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడు. భవాని ప్రసాద్ ప్రయత్నం ఫలించిందా అన్న విషయాన్ని వెండితెరపై చూడాలి.

ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ అనేది పెద్దగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. హీరోయిన్ పూజా ఝవేరీ రోల్ కు ఇంపార్టెన్స్ కూడా తక్కువే. అల్లరి నరేష్ ఎక్కువగా ఎమోషన్స్ పై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.  'స్వాతిలో ముత్యమంత' అనే సాంగ్ లో హీరోయిన్ గ్లామర్ పండించింది.

ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఓల్డ్ సినిమా స్టయిల్ లో సాగుతాయి. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. నిజానికి, మిగతా కమెడియన్స్ ను వెన్నెల కిషోర్ డామినేట్ చేశాడని చెప్పుకోవాలి.

ఓవరాల్ గా ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కామెడీని ఇష్టపడేవారికి ఓ మంచి సినిమాను చూసామన్న ఫీల్ ను కలిగిస్తుంది "బంగారు బుల్లోడు". ఇంకొంచెం మెరుగులు దిద్ది ఉంటే ఈ సినిమా మరింత బాగా రూపొంది ఉండేదని విశ్లేషకుల  అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: