బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి ఒకరు. సీజన్ 3 క్రేజీ కంటెస్టంట్స్ లో ఒకరైన అషు రెడ్డి హౌజ్ లో ఉన్నన్నాళ్లు సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న అషు రెడ్డి అంతకుముందు డబ్ స్మాష్ ద్వారా అందరికి పరిచయమైంది. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ కూడా అందుకుంది. ఫైనల్ గా అషు రెడ్డి ఈమధ్య రకరకాల ఈవెంట్స్ లో కనిపిస్తుంది.

ఇదిలాఉంటే అషు రెడ్డి తన ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పెడుతూ అషు రెడ్డి తన సత్తా చాటుతుంది. అంతేకాదు తన ఫ్యాన్స్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా తన అసలు పేరు బయటపెట్టింది అషు రెడ్డి. అషు రెడ్డి అసలు పేరు అశ్విని రెడ్డి అట.. ఆమెను అందరు అషు.. అషు అని పిలవడంతో అషు రెడ్డిగా ఫిక్స్ అయిందని చెప్పింది. తన అసలు పేరు చాలా తక్కువమందికి తెలుసని. తన క్లోజ్ సర్కిల్స్ లో కూడా కొందరికి తన అసలు పేరు చెప్పలేదని అన్నది అమ్మడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ తో ఈమధ్య అషు రెడ్డి పార్టీలు, ప్రైవేట్ మీటింగ్స్ అంటూ హడావిడి చేస్తుంది. రాహుల్ తో మీ రిలేషన్ ఏంటి అతను కేవలం ఫ్రెండ్ మాత్రమేనా ఇంకా ఏదైనానా అని అడిగితే రాహుల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువే అంటూ చెబుతుంది అషు రెడ్డి. మరి ఇద్దరి వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ లో పునర్నవితో క్లోజ్ గా ఉండి ఆల్మోస్ట్ బయటకు వచ్చాక పెళ్లే అనే రేంజ్ లో కలిసిపోయిన రాహుల్ బయటకు వచ్చాక మాత్రం సీన్ లోకి అషు రెడ్డిని తెచ్చాడు. మరి అషు, రాహుల్ ల మధ్య రిలేషన్ పై వారు మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: