పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలో విడుదల అవడానికి రెడీ గా ఉంది.. లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన కూడా వచ్చింది.  యాక్షన్ ప్రధానంగా గా వచ్చిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.టీజర్ లో  పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగా  బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. అయితే బాలీవుడ్ లో కమర్షియల్ గా తెరకేక్కని సినిమాని తెలుగులో చాల మార్పులు చేర్పులు చేసి పవన్ ఇమేజ్ కి తగ్గట్లు తెరకెక్కించారని అంటున్నారు.  టీజర్ చూసిన తర్వాత అది స్పష్టంగా తెలుస్తుంది.  పవర్ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ మాతృకలో భారీ మార్పులు చేశారు.

నిజానికి రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు పింక్ సినిమా చేస్తున్నారనగానే అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సినిమా మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా. అందులోనూ హీరో కంటే ముగ్గురు అమ్మాయిల ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ ని తృప్తి పరిచే అంశాలు ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే 'వకీల్ సాబ్' టీజర్ చూసిన తర్వాత వారందరూ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.కోర్ట్ డ్రామా అనుకున్న సినిమాని ఫైట్ సీక్వెన్స్ లతో యాక్షన్ మూవీ అనుకునే రేంజ్ లో చూపించారు. 'వకీల్ సాబ్'లో చేసిన ఈ మార్పుకు క్రెడిట్ మాత్రం దర్శకుడు వేణు శ్రీరామ్ కే దక్కుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: