నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టాడు. "అష్టా చెమ్మా" సినిమాలో అనుకోకుండా హీరోగా అవకాశం రావడంతో ఆ సినిమాకు ఒకే చెప్పేసాడు.  సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో వరుస ఆఫర్లతో హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు. నాని సినిమాల్లో "అష్టా చెమ్మా, పిల్ల జమిందార్, నేను లోకల్, కృష్ణ గాడి వీర ప్రేమ కథ, ఎంసీఏ, అలా మొదలైంది" తో పాటు మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో నాని కి అభిమానులు పెరిగిపోయారు. ఇక గతేడాది ఓటీటీ లో రిలీజ్ అయిన "వి" సినిమా బోల్తాపడటం తో ఆచితూచి అడుగేస్తున్నాడు. ఇక ప్రస్తుతం "టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, సుందరానికి తొందరెక్కువ" అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్స్ అన్నీ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

దాంతో ఈ మూడు సినిమాలపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక వీటిలో ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగుంపు దశకు చేరుకుంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సినిమా ను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దాంతో వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని సరసన పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: