కావలి రవి కుమార్ మీకు గుర్తు ఉన్నాడా.. ఏంటి ఎవరు ఈ కావలి రవి కుమార్ అని అనుకుంటున్నారా.. ! ఆయన మరెవరో కదండీ మన  బిత్తిరి సత్తి. మన అందరికి బిత్తిరి సత్తి గానే సుపరిచితుడు అయ్యాడు. నిజానికి బిత్తిరి అసలు పేరు కావలి రవి కుమార్.  నటనపై ఉన్న మక్కువతోనే అవకాశాలు వెతుక్కునే క్రమంలో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు.  ఆ తర్వాత వార్తా ప్రపంచంలో బుల్లితెరపై ఓ సంచలనంగా మారాడు.  బిత్తిరి సత్తి ఇప్పుడు తెలుగులో  చాలా ఫేమస్ అయిపోయాడు.  జీ తెలుగులో ప్రసారమైన "కామెడీ క్లబ్" అనే రియాలిటీ షోలో మొదటిసారిగా పాల్గొన్నాడు. ఆ తరువాత తీన్మార్ సావిత్రి తో కలిసి ప్రతిరోజు రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ వార్తలలో సమాచారాన్ని ప్రజలకు  అందించాడు. తీన్మార్ అనే కార్యక్రమంతో రవికి పాపులారిటీ రావడమేకాకుండా, రవి రాకతో ఆ కార్యక్రమం ఎంతో విజయవంతమైయింది. తీన్మార్ వార్తల కార్యక్రమంతో వి6 రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తరువాత సీమ శాస్త్రి చిత్రంలోని చిన్న పాత్రతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. ఆ తరువాత  రుద్రమదేవి చిత్రంలో సామంత రాజు పాత్రలో నటించాడు. అంతేకాకుండా తుపాకి రాముడు సినిమాలో బిత్తిరి సత్తి  హీరోగా కుడా  నటించాడు.

ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. అయితే ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది.అయితే  టీవీ9 నుంచి మంచి ఆఫర్ రావడంతో తనకు లైఫ్ ఇచ్చిన V6ని వదిలేసి టీవీ9కి జంప్ చేశారు బిత్తిరి సత్తి. అయితే, తీన్మార్ వార్తలు మాదిరిగానే టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ స్టార్ట్ చేశాడు బిత్తిరి. ప్రారంభంలో ఈ షోకి అంత ప్రాధాన్యత  రాలేదు. ఆ తర్వాత కరోనా బారిన పడి బయటపడ్డాడు. ఆ తర్వాత సాక్షిలో చేరి ఫుల్ బిజీ అయిపోయాడు బిత్తిరి సత్తి. చాలా రోజుల తర్వాత బిత్తిలి సత్తి మళ్లీ ఇప్పుడు  సోషల్ మీడియాలో సందడి చేసాడు.ఎందుకు అనుకుంటున్నారా.. బిత్తిలి సత్తి పెద్ద కుమారుడు అయిన శివ పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాడు.  

జనవరి 24న బిత్తిరి సత్తి పెద్ద కొడుకు శివ పుట్టిన రోజు. కొడుకు పుట్టినరోజున  చాలా ఎమోషనల్ అయ్యాడు బిత్తిరి సత్తి. అలాగే ఇప్పటివరకు తన కొడుకు గురించి ఎవరికి తెలియదు. అందుకనే పుట్టినరోజు సందర్బంగా తన కొడుకును అందరికీ పరిచయం చేసాడు సత్తి.అయితే బిత్తిరి సత్తి కొడుకుని చూసి అందరు షాక్ అయ్యారట.  వామ్మో బిత్తిరి సత్తికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యంలో ఉండిపోయారు.సత్తి  తన కొడుకును పరిచయం చేయడమే కాకుండా వాళ్ల గురించి కూడా కొన్ని విషయాలు  చెప్పుకొచ్చాడు. నా  కొడుకులకు నేనేమి ఆస్థి, ఐశ్వర్యాలు ఇవ్వడం లేదని... నలుగురిని నవ్వించే నవ్వులు మాత్రమే ఆస్తిగా ఇస్తున్నాన్నాని  అంటున్నాడు ఈయన. అంతేకాదు తన తరువాత ప్రేక్షకులను  నవ్వించే బాధ్యతను తన వారసులు కొనసాగిస్తారని చెప్తున్నాడు బిత్తిరి సత్తి. తన కొడుకు చూస్తుండగానే  తనకంటే ఎదిగిపోయాడని, తనకంటే నాలుగు ఇంచులు ఎక్కువే ఎత్తు పెరిగాడని  చెప్పాడు సత్తి. తన కొడుకు బర్త్ డే రోజు తమకు లైక్ కొట్టిన వాళ్లను, బిడ్డకి శుభాకాంక్షలు తెలిపి కామెంట్ చేసిన వేల మందిని చూపిస్తూ వాళ్లంతా తమ వాళ్లే, వాళ్ళ అభిమానం లేకపోతే మనం ఈరోజు ఇక్కడి దాక వచ్చే వాళ్ళం కాదని కొడుకుకు చెప్పాడు బిత్తిరి సత్తి. బిత్తిరి సత్తి ఎమోషనల్  పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతుండడం విశేషం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: