పామును చూసి చాలామంది బయపడి పోతూ ఉంటారు. ఎందుకంటే పాము కాటుకు గురయితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది కావున పామును చూసి చాలా మంది భయపడతారు. అయితే మన బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ మాత్రం దైర్యంగా పామును చంపాడు తెలుసా? ఏంటి ఆయన ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది. ఎంతోమంది పని వాళ్ళు చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. అంతమంది ఉన్న ఇంట్లోకి అసలు పాము ఎలా వచ్చింది ? ఆ పామును పనివాళ్ళు కాకుండా అమితాబ్ ఎలా చంపాడు అని ఆలోచిస్తున్నారా... కానీ మీరు విన్నది.. మేము చెబుతున్నది రెండు నిజమే.  కాకపోతే అమితాబ్ పామును చంపింది ఇప్పుడు కాదు.తాను  చిన్నతనంలో ఉన్నప్పుడు చంపారట. సినిమాల్లోకి రాకముందు ఈ పామును చంపే ఘటన జరిగింది. అంతేకాదు అమితాబ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడట. స్నేహితులతో కలిసి ఆడుకోవడం.కొంటె పనులు చెయ్యడం అతనికి అలవాట.

ఈ విషయాలన్ని  ఆయనే స్వయంగా కౌన్ బనేగా కరోడ్ పతీ-12వ సీజన్ షో లో తెలిపారు. అమితాబ్ బాల్యంలో చేసిన కొంటి పనులు, తన మాస్టర్ తో తిన్న దెబ్బలు అన్ని గుర్తుచేసుకొని ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయి ముసి ముసి నవ్వులు నవ్వారు. బిగ్ బి పాఠశాలలో చదివే అప్పుడు స్నేహితులతో కలిసి పామును చంపినట్టు తెలిపారు. అంతేకాకుండా పామును చంపి ఆ పాముని పట్టుకుని   స్కూల్ గ్రౌండ్ అంతా  తిరిగినట్టు తెలిపారు.

ఆ విషయాన్నీ తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారందరిని గదిలోకి పిలిచి పామును చంపింది ఎవరని అడిగిరట.  ఆ పామును చంపారని చెప్పకుండా అబద్దం చెప్పినందుకు ప్రిన్సిపాల్ దారుణంగా నూనె పూసిన కర్రలతో విపులపై కొట్టారట. అయితే ఆ విషయం ఇప్పుడు చెప్పడానికి నవ్వు వస్తున్నా కానీ  అప్పట్లో చాలా బాధేసింది. ఎందుకంటే మేము చిన్నపిల్లలం. మా ప్రిన్సిపాల్ చాలా గట్టిగా మమ్మల్ని కొట్టడం వలన చాలా బాధ వేసిందని బాల్యాన్ని నెమరు వేసుకున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: