అక్కినేని సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే..  మరో వైపు ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి ఫుల్ బిజీ బిజీగా గడిపింది. కాగా ప్రస్తుతం సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో సరికొత్త రోల్ లో కనిపించబోతోంది సామ్. మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ పాత్రలో నటిస్తోందన్న విషయాన్ని సమంతే స్వయంగా చెప్పింది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా హడావుడిగా పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. తన ఫోటోలను అభిమానులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ తో అప్పుడప్పుడూ చిట్ చాట్ చేస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్  అడిగిన ప్రశ్నలకు.. తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇందులో సామ్ ఫ్యాన్స్ చైతూ, సినిమాలు, వ్యక్తిగతం గురించి పలు ప్రశ్నలు వేసారు.
వారు అడిగిన ప్రశ్నలకు సామ్ ఫన్నీగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అందులో ఒక అభిమాని ‘ట్రోల్స్ మీపై ఎక్కువగా వస్తుంటాయి కదా.. వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు’ అంటూ ప్రశ్నించాడు. దానికి సమంత ఇలా సమాధానం చెప్పింది.. ‘కెరియర్ స్టార్టింగ్ తో ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల బాధతో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చాలా కోపం వచ్చేది.. అలాంటి ట్రోల్స్ చూస్తుంటే.. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కూడా అలాంటి ట్రోల్స్ వచ్చాయంటే నవ్వు వస్తోంది. నాకు ఒక విషయం అర్థమైంది.. మనకు ట్రోల్స్ వస్తున్నాయంటే మనం ఎంతో సాధించామనే అర్థం. అందుకే ట్రోల్స్ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. బాధ అంతకంటే పడటం లేదు’ అని సమాధానమిచ్చింది సామ్.

కాగా పెళ్లి తర్వాత ఈ అక్కినేని సమంతపై ట్రోల్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయనేది వాస్తవం. పెళ్లి తర్వాత కూడా అలాంటి కస్ట్యూమ్స్ వాడటమేంటని కొందరు నెటిజన్లు సమంతపై కామెంట్లు కురిపిస్తున్నారు. అలాంటి విషయాలను సామ్ ఏమాత్రం పట్టించుకోకుండా తన కెరియర్ ను మలుచుకునే పనిలో పడింది.  ఒకరకంగా చెప్పాలంటే పాజిటీవ్ విషయాలను మాత్రమే పట్టించుకుని ఈ చిన్నది ముందుకు వెలుతోందనే చెప్పుకోవచ్చు. అందులోనూ చైతూ కూడా క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు.. వారి ఎదుగుదలను ఎందుకు అడ్డుకోవాలని సామ్ జామ్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇవేమీ పట్టించుకోని కొందరు ఇంకా సామ్ పై కామెంట్లు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: