సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరో హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. అయితే అలా వచ్చిన అందరూ స్టార్  హీరోయిన్లుగా ఎదుగుతారు అన్న రూలేమీ లేదు.
ప్రేక్షకులు కొంతమందిని ఆదరిస్తే, మరికొంత మందిని ఆదరించలేకపోతున్నారు. కొంతమంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమకున్న అందంతో, తెలివితో, తమదైన నేర్పు తో కలగలసిన విన్యాసాలు చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. మరికొంత మంది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయి,ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి కనుమరుగై పోతుంటారు.  కానీ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి 2020 వ సంవత్సరంలో ఎంతో మంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. అలా వచ్చిన కొత్త హీరోయిన్లలో  ఎంత మందికి 2020 వ సంవత్సరం బాగా కలిసొచ్చిందో ఇప్పుడు చూద్దాం

వర్ష బొల్లమ్మ:
పోయిన సంవత్సరం" విజిల్" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వర్ష, ఆ తర్వాత జాను, చూసి చూడంగానే,చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మెలోడీస్  చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

నూరిన్ షరీఫ్:
2019లో లవర్స్ డే అనే డబ్బింగ్ చిత్రం లో చిన్న పాత్ర చేసి, ఆ తర్వాత 2020 లో ఊలాల్ల  ఊలాల్ల  అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి అందరినీ మెప్పించింది.

రూప కొడవయుర్:
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో నటించి అందరినీ మెప్పించింది.

ప్రియా లాల్:
సత్యదేవ్ హీరోగా నటించిన గువ్వా గోరింక అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అవ్వడానికి రెడీ అవుతోంది.

శివశక్తి సచ్ దేవ్ :
అమరం అఖిలం ప్రేమ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది.

దివ్య రావ్ :
డిగ్రీ కాలేజ్ సినిమాలో తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

అప్సర రాణి:
ఊలాల్ల  ఊలాల్ల సినిమా తోపాటు పాటు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం థ్రిల్లర్ సినిమాల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

అమిత రంగనాథ్:
అమృత రామన్ చిత్రం ద్వారా పరిచయమైంది.

దృశిక  చందర:
బుచ్చినాయుడు కండ్రిగ ద్వారా పరిచయమైంది.

పూజిత కురపర్తి:
గతం అనే వైవిధ్యమైన చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది.

ప్రియాంక శర్మ:
సవారీ చిత్రం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: