అనంత శ్రీరామ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మంచి వినసొంపైన పాటలు. అనంత శ్రీరామ్ రాసే  ఏ పాట అయినా సరే ఇట్టే  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  అంతటి గొప్ప పాటలు రాసే అదృష్టం కేవలం అనంత శ్రీరామ్ కే దక్కింది అని చెప్పవచ్చు.సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కథ, కామెడీ, సన్నివేశాలతో పాటు ఆహ్లాదకరమైన పాటలు ఇలా ఎన్నో......
ముఖ్యంగా ఇందులోని పాత్రలు, కథానాయకులతో పాటు, సన్నివేశాన్ని బట్టి పాటలు కూడా రాయాల్సి వస్తుంది.అయితే సినిమాలో మాత్రం ఈ పాటలు రాయాలంటే కొన్ని పరిధిలు ఉంటాయి.


కథకు,సన్నివేశానికి తగినట్లుగా పాటలు రాయాలంటూ  రచయితలకు,దర్శక నిర్మాతలు ఎన్నో రకాలైన నిబంధనలను విధిస్తూ ఉంటారు. కానీ  రచయితలు ఒక పాటను ,  సన్నివేశానికి తగ్గట్టుగా రాయడానికి కొంత సమయం అంటూ పడుతుంది. అందులో  ఒక గంట కాలవ్యవధిలో పూర్తి చేయవచ్చు లేదా కొన్ని రోజుల తరబడి సమయాన్ని కేటాయించవచ్చు. అయితే కొన్ని పాటలు  తమ ఆలోచనలకు పదునుపెట్టి రాయాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది.అయితే కష్టానికి ప్రతిఫలంగా ఆ పాటలు రచయితలకు మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంటాయి.

సరిగ్గా ఇలాంటి సిట్యుయేషన్ రైటర్ అనంత శ్రీరామ్ కు ఎదురయింది. అది ఏంటో,ఆయన ఆ పాట రాయడానికి,  ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడో? ఇప్పుడు ఇక్కడ  చదివి తెలుసుకుందాం.
     

సునీల్,సలోని జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా "మర్యాద రామన్న".
సినిమా భారీ విజయంతో దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం, హీరోయిన్ సలోని తనకు కాబోయే భర్తను  ఊహించుకుంటూ బొమ్మలు గీస్తూ ఉంటుంది. వాటిని చూస్తూ కుటుంబసభ్యులంతా పిచ్చి గీతలు అంటూ హేళన చేస్తుంటారు. ఆ బొమ్మల్లో ఏదో విషయం దాగుందని,ఆ కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేసేలా హీరో సునీల్ ఒక పాట రూపంలో చెప్పాల్సిన సందర్భం అది. అయితే ఈ సందర్భం అనంత శ్రీరామ్ కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి సన్నివేశానికి అనుగుణంగా " తెలుగమ్మాయి....తెలుగమ్మాయి.... " అంటూ అనే ఈ పాట రాయడానికి, ఏకంగా 43 రోజులు పట్టింది. కాబట్టి కష్టానికి ప్రతిఫలంగా అనంత శ్రీరామ్ కు ఈ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: