మాస్ మహరాజ్ రవితేజకి 2021 స్టార్టింగ్ లోనే సూపర్ డూపర్ హిట్ తగిలింది. క్రాక్ తో మరోసారి తన మాస్ మేనియా కొనసాగిస్తున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా రవితేజ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా థియేటర్లు కళకళాడుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరచుకున్నా ఆడియెన్స్ మునుపటిలా సినిమాను చూస్తారా అన్న డౌట్ ఎక్కడో ఓ మూలన ఉంది.

అయితే క్రాక్ హిట్ తో ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఇక ఇదే జోష్ తో రవితేజ తన నెక్స్ట్ సినిమా ఖిలాడిని పూర్తి చేయాలని వేగం పెంచాడు. రవితేజ బర్త్ డే సందర్భంగా ఖిలాడి నుండి ఓ టీజర్ వదిలారు. క్రాక్ మేనియా కొనసాగించేలా ఖిలాడి కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న తమిళ సూపర్ హిట్ మూవీ విక్రం వేద రీమేక్ లో నటిస్తాడని టాక్. రవితేజకు పఫెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్న ఆ కథ తను ఫ్లాపుల్లో ఉండటం వల్ల పట్టించుకోలేదు.

కాని క్రాక్ హిట్ తో కాన్ ఫిడెన్స్ రావడంతో మళ్లీ విక్రం వేద సినిమా మీద ఫోకస్ పెట్టాడట రవితేజ. కిశోర్ కుమార్ అలియాస్ డాలీ ఈ సినిమాను రీమేక్ చేస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా విక్రం వేదని తెరకెక్కిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉండగా అది ఎవరు చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: