ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....   కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ సినిమా ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్న  సినిమా కేజీఎఫ్.కేజిఎఫ్ డైలాగ్స్ కాని ఎలివేషన్స్ కాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమా నేపధ్య సంగీతం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా  ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా. తెలుగులో కూడా అద్భుతమైన మార్కెట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలని తల్లక్రిందులు చేసింది.

అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 ని కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెరకెక్కించేశారు.లాక్    డౌన్ కారణంగా కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ పడినా కూడా ఆ తర్వాత స్పీడ్ అందుకుంది ఈ సినిమా. ఇక ఈ మధ్య   వచ్చిన టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. హిందిలో ఈసినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. సంజయ్ దత్ విలన్ గా చేస్తుండంటం, రవీనా టాండన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండటం అనేది కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. అందుకే, హిందీలో గతంలో కంటే కూడా మూడురెట్లు ఎక్కువే ఆఫర్ వస్తోందట. లాస్ట్ టైమ్ కేజీఎఫ్ తీసుకున్న ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లే ఈసారి కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 ని తీస్కుంటున్నట్లుగా సమాచారం.మలయాళం, తమిళం, తెలుగు మార్కెట్స్ ని కూడా షేక్ చేస్తోంది ఈసినిమా. ఈ మూడు భాషల్లో కూడా చాప్టర్ 2 మూడురెట్లు రేటు ఎక్కువ పలుకుతోందని సమాచారం అందుతుంది.

కేజీఎఫ్ సినిమా కంటే కూడా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకి కనిపిస్తున్నాయి. కేజీఎఫ్ 2 కి వస్తున్న మార్కెట్ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అన్ని భాషల నుంచి కూడా సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా డబ్బింగ్ కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి యష్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో  అనేది చూడాలి.ఇక ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో వున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: