టాలీవుడ్ అగ్ర హీరోలు  రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా రౌద్రం, రణం, రుధిరం..డి. వి. వి దానయ్య అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగా, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అలరించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన ట్రైలర్ నువిడుదల చేయడంతో ఈ సినిమా పై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ” ఆర్ఆర్ఆర్ “సినిమా రిలీజ్ డేట్ ను చెప్పడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను చెప్పడంతో ఇతర సినిమాలు కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న” రాధేశ్యామ్”చిత్రం దాదాపు పూర్తి చేసుకుని తొందరలోనే విడుదలకు సిద్ధం కానుంది. ప్రభాస్సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని చెప్పడంతో, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రం విడుదల వాయిదా పడుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ పోస్టర్లు చూసిన అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా విడుదల పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కొంతమేర ప్రభాస్ ఫ్యాన్స్ చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారని చిత్ర బృందం తెలియజేయడంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పేరు వినగానే కొంతవరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశను మిగులుస్తుంది. ఇకపోతే తమ హీరో సినిమా విడుదల తేదీని ఎప్పుడు చేస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: