ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇప్పుడు చూసుకున్నట్లయితే బాహుబలి పుణ్యమా అని  పాన్ ఇండియా సినిమాలు బాగా తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు కూడా అందరూ పాన్ ఇండియా సినిమాలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అందుకు తగ్గట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో  పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో ప్రత్యేకంగా  గా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా కొన్ని చిన్న సినిమాల్లో కూడా మన హీరోలు చాలా పవర్ఫుల్ గా దర్శనమివ్వబోతున్నారు, అంటే దాదాపు ఒక బీస్ట్ మోడ్ అన్నమాట. అలాంటి పాత్రలతో రాబోతున్న హీరోలపై ఒక చూపు చూస్తే...రాజమౌళి తెరకెక్కిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా కొమరం భీమ్ టీజర్ చూడగానే ఆడియెన్స్ పిచ్చ ఫ్లాట్ అయ్యి  ఎన్టీఆర్ కు బీస్ట్ మోడ్ అని ట్యాగ్ ఇచ్చేశారు.

తప్పకుండా ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉహించని విధంగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రపై కూడా అంచనాలు ఏ రేంజిలో లో ఉన్నాయో "ఆర్ ఆర్ ఆర్ " ఫస్ట్ టీజర్ తోనే అర్దమయ్యింది. ఫిట్నెస్ కోసం చరణ్ చాలా నెలలు కష్టపడ్డాడు. అందుకే ఆయన కూడా బీస్ట్ మోడ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.ఇక మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్  ఆదిపురుష్" సినిమా కోసం అటు ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా ప్రభాస్ పవర్ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడట. రాముడి పాత్రే అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఊహించుకుంటున్నారు.

మరో సినిమా సలార్ లో కూడా ప్రభాస్ సరికొత్త ఫిట్నెస్ తో కనిపించనున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబాట్టి నెవర్ బిఫోర్ అనేలా ఒక రేంజిలో ప్రభాస్ పాత్ర  ఉంటుందని సమాచారం అందుతుంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా రోజుల తరువాత ఒక సరికొత్త బీస్ట్ మోడ్ లుక్ లో దర్శనమిచ్చాడు. గని సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్న వరుణ్ బాడీ కూడా గట్టిగానే పెంచాడు.ఇతని పాత్ర కూడా ఒక రేంజిలో ఉంటుందట.ఇక ఆశ్చర్య పడే విషయం ఏంటంటే ఎంతో సాఫ్ట్ గా  క్యూట్ లవర్ బాయ్ గా కనిపించే నాగా శౌర్య కూడా మొదటిసారి లక్ష్య సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: