నట కింగ్ అక్కినేని నాగార్జున గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టి,తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును  తెచ్చుకున్నాడు. అలా ఎన్నో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ తో పాటు క్లాసికల్ హిట్స్ కూడా కొట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. నాగార్జున కేవలం దక్షిణ భారత సినీ పరిశ్రమకే కాకుండా ఉత్తరాది సినీ పరిశ్రమకు కూడా బాగా  పరిచయం అయ్యి, తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు . నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్ విషయంలో ఈ తరం హీరోలకు పోటీ  ఇస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 60 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్ మెయింటైన్ చేస్తూ, ప్రస్తుతం ఉన్న హీరోలకు అసూయ  కలిగేలా చేస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్ బాస్ లాంటి ఎంతో  ప్రతిష్ఠాత్మకమైన షోలకు హోస్ట్ గా వ్యవహరించి, ఏ రంగంలోనైనా సాధించగలడు అని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను ఏ కారణం చేత వదులుకోవాల్సి వచ్చిందో  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కలిసుందాం రా:
కలిసుందాం రా దర్శకుడు ఉదయశంకర్ మొదట ఈ  సినిమాను  నాగార్జున తో తీద్దాం అనుకుని కథ వివరించాడు. నాగార్జునకు కథ నచ్చినప్పటికీ అన్నీ  వరుసగా ఫ్యామిలీ సినిమాలు తీసి, ఉండడంతో మళ్లీ అదే జాడలో  వెళ్ళడం ఇష్టం లేక నాగార్జున ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించాడు.

 బద్రి:
కొత్త తరహా పాత్రలతో పాటు కథలకు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్  ఇవ్వడానికి రెడీగా ఉండే అక్కినేని నాగార్జున కోసమే ఈ స్టోరీని సిద్ధం చేసుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ అప్పట్లో నాగార్జున అప్పటికే వరుసగా సినిమాలకు డేట్లు ఇవ్వడంతో ఈ సినిమా చేయలేకపోయాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో శివమణి తోపాటు సూపర్ అనే సినిమాలో వచ్చాయి.వీటిలో శివమణి భారీ హిట్ కొట్టింది.

ఘర్షణ:
మొదట్లో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ తీద్దాం  అనుకున్నాడు  డైరెక్టర్ మణిరత్నం. కానీ అప్పట్లో వీరిద్దరికీ ఎంతో  క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ కూడా అంతే గట్టిగా ఉండేది. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: