హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సునీల్ హీరోగా హరీష్ శంకర్ కథతో వేదాంతం రాఘవయ్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..  సి చంద్ర మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. మొదట్లో కమెడియన్ గా మంచి పేరున్న సునీల్ హీరో గా మారి మంచి హిట్ లు కొట్టాడు.

అయితే గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక మళ్ళీ కమెడియన్ బాటపట్టాడు.. విలన్ గా కూడా చేశాడు. డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాల్లో విలన్ గా చేసి తన నటనలోని అన్ని కొనాలని ఆవిష్కరించాడు.. ఇప్పుడు ఓ మంచి కథ దొరకడంతో మళ్ళీ హీరోగా సినిమా చేస్తున్నాడు.. టాప్ దర్శకుడు హరీష్ శంకర్సినిమా కి కథ అందించడం విశేషం కాగా ఈ సినిమా లో అనసూయ హీరోయిన్ రేంజ్ పాత్ర లో నటిస్తుందట..ఇటీవలే ఆమెను కలిసి కథ చెప్పిన టీం ఆమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇకపోతే జబర్ధస్త్ కామెడీ షోకు వచ్చిన తర్వాత అనసూయ ఆస్తుల చిట్టా కూడా అంత కంతకు పెరిగిపోయిందనే టాక్ వినబడుతోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత సంపాదన విషయంలో టాప్‌లో ఉంది అనసూయ. కేవలం జబర్ధస్త్ షోతోనే ఈమె ఆదాయం పెరిగింది. ఈ షోతోనే వచ్చిన పాపులారిటీతో ఈమె సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాదు సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనసూయ.. కేవలం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్థస్త్ షోతో పాటు పలు టీవీ ఛానెల్స్‌లో ప్రోగ్రామ్స్ చేస్తోంది.ఈమెకు జూబ్లిహిల్స్‌లో దాదాపు రూ. 8 కోట్లు విలువ చేసే ఇల్లు.. కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు రెండు కార్లు.. దాదాపు వీటి విలువ రూ. 2.50 కోట్ల వరకు ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: