యాంకర్ గా ఇప్పుడు ప్రదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో ఓ సినిమా తో ముందుకు రాబోతున్నాడు.. ఈ 29 న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేసినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దీని ప్రమోషన్ కి తన బుల్లితెర స్నేహితులందరిని వాడుతున్న ప్రదీప్ సినిమా తో హిట్ కొట్టాలని భావిస్తుండగా ప్రేక్షకులు ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కాగా, సుడిగాలి సుధీర్ స్పీచ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. ‘ప్రదీప్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. దీని కోసమే కాదు.. షోలలోనూ మిమ్మల్ని నవ్వించేందుకు తన బాధను సైతం పక్కన పెట్టేస్తాడు. తనకు ఆరోగ్య సమస్య ఉంది. దీంతో సరిగా కూర్చోలేడు. దీనివల్ల అతడు చేసే ప్రతి షోలోనూ నిలబడే ఉంటాడు. అతడి పెదాలపై కనిపించే నవ్వు వెనుక ఎంతో బాధ ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ప్రదీప్ నాకు సోదరుడితో సమానం. నా సినిమా గురించి కూడా ఎప్పుడూ దేవుడికి దండం పెట్టలేదు. కానీ, ఇప్పుడు ఈ మూవీ హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. అతడు అంతలా కష్ట పడతాడు. పాటను ఎంత హిట్ చేశారో.. సినిమానూ అలానే చేయండి. బాగుందని పది మందికి చెప్పి సినిమా చూపించండి' అంటూ కోరాడు సుధీర్.  ఇక అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: