సంసార జీవితానికి పనికిరాడని భర్తను వదిలేసింది  ఓ స్టార్ హీరో భార్య.. తాను గే అని స్వయంగా భర్తే ఒప్పుకోవడంతో ఆమె కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. ఈ విషయాన్నీ ఆ హీరో బహిరంగంగా చెప్పగా కోర్టులో వీరిద్దరూ విడాకులకు అప్లై చేసుకున్నారు. హాలీవుడ్ నటులు, దంపతులు ఎమ్మా పోర్ట్‌నర్, ఇలియట్ పేజ్ 2018 లో వివాహం చేసుకోగా ఇన్ని రోజుల వారి కాపురానికి ఇప్పుడు తెరపడింది. వారి మూడేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు వారు వెల్లడించారు. ఈ జంట ఈరోజే మ్యాన్‌హట్టన్‌ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామన్నారు.

 ఇలియట్ పేజ్ ఈ విడాకుల గురించి మాట్లాడుతూ ‘‘ఎంతో సుదీర్ఘ ఆలోచనలు.. చర్చ తర్వాత మేం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. విడాకులు తీసుకుని ఒకరికొకరం దూరం గా సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాం..విడాకులు తీసుకున్నా మా మధ్య స్నేహం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలానే కొనసాగుతాయి. అన్నారు. మేము ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాం అని ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏడాది పాటు డేటింగ్‌ చేసిన వీరు మూడేళ్ళుగా కాపురం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవోడం గమనార్హం..

పేజ్‌ 2014లోనే తాను గేనని ప్రకటించారు. తాజాగా పేజ్‌ తనను తాను ట్రాన్స్‌మ్యాన్‌గా అంగీకరించారు. గతేడాది డిసెంబర్‌లో తనను తాను ట్రాన్స్‌ మ్యాన్‌గా గుర్తించానని.. తనకు మద్దతుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పేజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నమ్మశక్యం కాని వ్యక్తులందరికి కృతజ్ఞతలు. నేను ఎవరనేది గుర్తించాను. నన్ను నేను గొప్పగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నాకున్న ఈ ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపర్చడానికి మాటలు చాలవు’’ అంటూ పేజ్‌ పోస్ట్‌ చేశారు. ఈ సమయంలో ఎమ్మా పోర్టనర్‌ పేజ్‌కి మద్దతు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: