ఇంటర్నెట్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ ఇలయదలపతి విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. తన అనుమతి లేకుండా తన పేరున రాజకీయ పార్టీ పెట్టినందుకు ఈ నోటీసులను విజయ్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దుమారమే రేపుతోంది. విజయ్ ఈ నోటీసులను తన న్యాయవాది కుమరేశన్‌ ద్వారా పంపించినట్టు సమాచారం. ఈ నోటీసులకు గల కారణాలను కూడా అందులోనే స్పష్టంగా వివరించారు.

 ‘‘గత జూన్‌ నెల 8వ తేదీన ‘అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’ అనే పేరుతో మీరు (ఎస్‌ఏ చంద్రశేఖర్‌) ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేయించారు. దీనిని ఖండిస్తూ విజయ్‌ అపుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మీరు తీసుకునే చర్యలకు విజయ్‌ మద్దతు ప్రకటించలేదు. మీరు స్థాపించిన పార్టీలో విజయ్‌ పేరు లేదా ఫొటో వాడకూడదు. ఉల్లంఘించినట్టయితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని విజయ్‌ తరపు న్యాయవాది సదరు నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో తమిళ నటులు వరుసపెట్టి రాజకీయాల్లోకి వచ్చేనెదుకు సిద్ధమయ్యారు. మొక్కల నీది మయ్యం పేరుతో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఓ పార్టీని ప్రారంభీంచారు. ఆ తర్వాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా సొంత పార్టీని స్థాపించి దిశగా అడుగులు వేశారు. కానీ పార్టీ పేరు, గుర్తు, పార్టీ జెండా ప్రకటనకు కూడా రెడీ అయిపోయారు. కానీ ప్రకటనకు కొద్దీ రోజుల ముందే రజినీ కాంత్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై ఆయన అభిమానులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కూడా పార్టీ స్థాపిస్తున్నాడంటూ వార్తలు వైరల్ కావడం ప్రారంభించాయి. అయితే ఈ వార్తలను స్వయంగా విజయ్ తీవ్రంగా ఖండించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని బహిరంగంగా ప్రకటింజారు.

మరింత సమాచారం తెలుసుకోండి: