ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అల్లరి నరేష్ ఈ సంక్రాంతికి  ‘బంగారు బుల్లోడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది. నిజానికి ప్రస్తుతం అల్లరి నరేష్ ఫోకస్ మొత్తం కూడా తన తదుపరి సినిమా ‘నాంది’ పైనే పూర్తిగా ఉంది. ‘బంగారు బుల్లోడు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ‘నాంది’ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. చాలా ఏళ్ల తరువాత ‘నాంది’ టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు అల్లరి నరేష్.ఇక "నేను"సినిమా తరువాత  ఈ సినిమాలో  సీరియస్ రోల్ లో నటించాడు ఈ కామెడీ హీరో .ఇందులో అల్లరి నరేష్ నగ్నంగా కనిపించనున్నాడు. చేయని నేరానికి శిక్ష పడ్డ ఖైదీ బయటకి రావడానికి ఎలాంటి పోరాటం చేశాడనేదే ఈ సినిమా కథ. విజయ్ కుమార్ అనే కొత్త  దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు.

 గత సంవత్సరంలోనే  ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందనుకున్నారు. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను హోల్ సేల్ గా కొనేసిన జీ స్టూడియోస్ సంస్థ ‘నాంది’ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది.రూ.8.5 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్ ను పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ డీల్ లోనే థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఉంటాయట.

ముందుగా ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసి కొన్ని రోజుల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వదులుతారని తెలుస్తోంది. ‘నాంది’ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసినా.. మంచి విజయాన్ని సాధించే అవకాశం వుంది. మరి ఈ సినిమాతోనైనా అల్లరి నరేష్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: