టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకుని ప్రేక్షకాభిమానుల మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన మహేష్ బాబు, ఆపై వచ్చిన అవకాశాలను వినియోగించుకుని కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ సూపర్ స్టార్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలతో కొనసాగుతున్నారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఇక వీరిద్దరి కెరీర్ లో ఎన్నో భారీ సక్సెస్ లతో పాటు కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరిద్దరి సినిమాలు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న ఈ ఇద్దరు హీరోల యొక్క కెరీర్ లో ఒక భారీ తేడా ని గమనించవచ్చు. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా వరకు రిమేక్ సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు.

అయితే అటు మహేష్ బాబు మాత్రం ఇప్పటికవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయకపోవడం గమనార్హం. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ, తనకు రీమేక్ లు స్ట్రెయిట్ స్టోరీ లు అనే బేధం ఉండదని, మంచి కథ అని అనిపిస్తే ఆ మూవీ ని ఓకే చేస్తానని చెప్తుంటారు. ఇక మహేష్ అయితే తాను రీమేక్స్ చేయకపోవడానికి కారణం, వాటిలో నటించడం వలన ఒకవేళ అవి ఫ్లాప్ అయితే, సదరు ఒరిజినల్ వర్షన్ కి మన వలన నెగటివ్ ఇమేజ్ వస్తుందని, అలానే ఒరిజినల్ క్యారెక్టర్స్ మాదిరిగా నేను ఆ స్థాయిలో న్యాయం చేయలేను అనేది నా భావన అని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి కెరీర్ లో ఈ తేడా మాత్రం యాదృచ్చికం అని అంటున్నారు విశ్లేషకులు .....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: