తెలుగులో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా పర భాషా హీరోలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. రజిని, కమల్ హాసన్ ల దగ్గర నుండి సూర్య, కార్తిల వరకు తమిళ హీరోలు తెలుగు బాక్సాఫీస్ పై విజయ పతాకం ఎగురవేశారు. ఒకానొక దశలో తెలుగు స్ట్రైట్ సినిమాలకు పోటీగా తమిళ డబ్బింగ్ సినిమాలు రావడం జరిగింది. అయితే పరిస్థితి మారింది ఇప్పుడు తెలుగు సినిమా కేవలం తమిళంలోనే కాదు హిందీ బాక్సాఫీస్ ను కూడా కొల్లగొట్టేస్తున్నాయి.

ఇదిలాఉంటే కన్నడ పరిశ్రమ నుండి వచ్చి తెలుగు నాట రికార్డులు సృష్టిస్తున్నాడు కె.జి.ఎఫ్ యశ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ సినిమాను సెన్సేషనల్ హిట్ చేశారు. ఇక ఇప్పుడు అదే జోరుతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రాబోతుంది. ఈ పార్ట్ 2 భారీ అంచనాలతో వస్తుంది. ఇప్పటికే టీజర్ తో సినిమా శాంపిల్ చూపించిన ప్రశాంత్ నీల్ అసలు సిసలు సినిమా వెండితెర మీద చూడాల్సిందే అంటున్నాడు.

అయితే తెలుగులో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రైట్స్ విషయమై ఒక్కో రోజు ఒక్కో టాక్ నడుస్తుంది. ఈమధ్యనే తెలుగు రెండు రాష్ట్రాలు కలిపి 60, 70 కోట్లు అనగా.. ఇప్పుడు కేవలం నైజాం వరకే 70 కోట్లు కోట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. దిల్ రాజు సీన్ లోకి ఎంటర్ అయ్యాక బిజినెస్ లెక్కలు మారినట్టు టాక్. అయితే తమిళ సూపర్ స్టార్ రజిని సినిమాను కూడా బీట్ చేసి కన్నడ స్టార్ యశ్ తెలుగులో సత్తా చాటుతున్నాడు. ఓ విధంగా మిగతా హీరోలెవరికి సాధ్యం కాని రజిని రికార్డ్ ను కన్నడ హీరో యశ్ బ్రేక్ చేస్తున్నాడని తెలుస్తుంది.                              


మరింత సమాచారం తెలుసుకోండి: