సౌత్ స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరు సినిమాలతో పాదు వెబ్ సీరీస్ లతో పోటీ పడుతున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాం ల మీద స్టార్స్ దృష్టి పడ్డది. సినిమాలకు ఆల్టర్నేట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫాం ల మీద ఫోకస్ పెట్టారు. అయితే స్టార్ హీరోయిన్స్ ఈ విషయంలో అడ్వాన్స్ గా ఉన్నారు. సమంత ఇప్పటికే ఓ వెబ్ సీరీస్ లో నటించగా మరో సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మరో వెబ్ సీరీస్ నటించింది.

అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ సీరీస్ పార్ట్ 2 వస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలిసిందే. ఈ వెబ్ సీరీస్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ ప్లాన్ చేశారు. అమేజాన్ ప్రైం లో సమంత చేసిన మొదటి వెబ్ సీరీస్ గా ఫ్యామిలీ మెన్ 2 రాబోతుంది. ఈ వెబ్ సీరీస్ తో సమంత డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతుంది. ఇక సమంతకు ఈక్వల్ గా కాజల్ కూడా లైవ్ టెలికాస్ట్ వెబ్ సీరీస్ లో నటించింది. వెంకట్ ప్రభు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ ను కూడా ఫిబ్రవరి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సమంత ఫ్యామిలీ మెన్ 2 అమేజాన్ ప్రైం లో రిలీజ్ అవుతుంటే.. కాజల్ లైవ్ టెలికాస్ట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. వెబ్ సీరీస్ లతో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. మరి వెబ్ సీరీస్ లతో ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. కాజల్ వెబ్ సీరీస్ థ్రిల్లర్ గా రాబోతుంది. సమంత ఫ్యామిలీ మెన్ కూడా మంచి కంటెంట్ తో రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: