చరణ్ జూనియర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ అక్టోబర్ 13న ఫిక్స్ కావడంతో చరణ్ జూనియర్ అభిమానులు ఆ డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ 9 నెలల ముందు నుండి రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే వీరి ఆనందానికి బ్రేక్ వేస్తూ కొందరు తెర పైకి తీసుకు వచ్చిన చరణ్ జూనియర్ లకు సంబంధించిన అక్టోబర్ నెగిటివ్ సెంటిమెంట్ వార్తలు విని ఈ ఇద్దరి హీరోల వీరాభిమానులు కలత చెందుతున్నారు.


అక్టోబర్ జూనియర్ కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఏ ఒక్క సినిమా అతడి కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా కాదు అంటూ కొన్ని ఉదాహరణలు తెర పైకి తీసుకు వస్తున్నారు. జూనియర్ నటించిన ‘బృందావనం’ ‘ఊసరవెల్లి’ ‘రామయ్యా వస్తావయ్యా’ ‘అరవిందసమేత’ సినిమాలు గతంలో దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో రెండు భయంకరమైన ఫ్లాప్ లుగా మారితే మరో రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ రెండు సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్స్ కావు అని కొందరి వాదన.


అదేవిధంగా రామ్ చరణ్ కు సంబంధించి అక్టోబర్ లో విడుదల అయిన ‘గోవిందుడు అందరివాడే’ ‘బ్రూస్లీ’ సినిమాలు గతంలో దసరా పండగ సీజన్ కు వచ్చి ఆ రెండు సినిమాలు చరణ్ కెరియర్ లోనే మర్చిపోలేని భయంకరమైన ఫ్లాప్ లుగా మారాయి. దీనితో రామ్ చరణ్ కు అక్టోబర్ నెల డార్క్ మంత్ అంటూ కొందరు చరణ్ కు గతం గుర్తుకు చేస్తున్నారు.


వీరిద్దరి హీరోల అక్టోబర్ సెంటిమెంట్ ఇలా ఉంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఏవీ గతంలో అక్టోబర్ లో విడుదల కాలేదని ఇండస్ట్రీ హిట్స్ అన్నీ సంక్రాంతికి కానీ దసరా కు కానీ వచ్చిన సందర్భాలు మాత్రమే ఉన్నాయని మరికొందరి వాదన. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ చరణ్ జూనియర్ ల వీరాభిమానుల దృష్టి వరకు రావడంతో ఇంత కాలం ఆలస్యం చేసిన రాజమౌళి ఇప్పుడు ఎందుకు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు సంబంధించి అక్టోబర్ ను ఎందుకు ఎంచుకున్నాడు అంటూ మధన పడుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: