తెలుగు చిత్ర పరిశ్రమలో "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" మూవీతో స్టార్ ఇమేజ్ అందుకున్న యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "A1 ఎక్స్‌ప్రెస్" మూవీతో త్వరలో దూసుకొస్తున్నాడు. టాలీవుడ్ లో వినూత్న కథ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్ . ఇతను 'స్నేహగీతం ' మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తర్వాత ప్రస్థానం, గుండెల్లో గోదావరి, వంటి సినిమాల్లో నటించాడు. హీరోగా "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" మూవీ లో అద్భుతంగా నటించి తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాడు.యువ హీరో సందీప్ కిషన్ చివరగా "నిన్నువీడని నీడను నేనే" సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన తెనాలి రామకృష్ణ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం తమిళ దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా,  లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వస్తున్న మూవీ  "A1 ఎక్స్‌ప్రెస్". ఈ మూవీ ఫిబ్రవరి  నెలలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'A1 ఎక్స్‌ప్రెస్'  మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా  ఉన్న  "A1 ఎక్స్‌ప్రెస్" మూవీ లో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ తో న్యూ లుక్  లో కనిపిస్తున్నాడు.
సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ  మన జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో హాకీ క్రీడా కారునిగ సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడని తెలుగు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. మన సౌత్ ఇండియా లో హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా  "A1 ఎక్స్‌ప్రెస్" కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: