జబర్దస్త్ షో తో అనస్య ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. గత ఏడేళ్లుగా అనసూయ ఈ షో కి యాంకరింగ్ చేస్తూ బాగానే ఆర్జించింది కూడా.. ఇక్కడ వచ్చిన పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది.. అక్కడ కూడా క్లిక్ అవడంతో ఆమెకు ఎదురు లేకుండా పోయింది.. దర్శక నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేక పాత్ర లు రాసి ఆమెను నటింపచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హీరోయిన్ ల కు సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ లు ఇచ్చి మరీ తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు..

ఇక టీవీ, బిగ్ స్క్రీన్ లలోనే కాదు సోషల్ మీడియా లోనూ అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ విషయాలపైనా కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ వస్తుంది.. అంతేకాదు సరికొత్త ఫోటో లను పెడుతూ తన అభిమానులను ఊరిస్తుంది.. కనిపించి కనపడని అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరి ఇంట్రెస్ట్ తనపై ఉండేలా చేసుకుంటుంది.. ఏళ్లుగా బుల్లితెర మహారాణిగా, కుర్రాళ్ళ కలలు సుందరిగా అనసూయ తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. అనసూయ యాంకర్ గా ఉందంటే కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా షో సక్సెస్ కావలసిందే.

ఇక తాజాగా ఆమె బ్లాక్ సారీ లో కుర్రాళ్ళ మతులు చెడగొడుతుంది.  అనసూయ సెక్సీ శారీలో ముస్తాబై మిడ్ నైట్ పార్టీకి హాజరయ్యారు. పలుచని పొరల నల్ల చీర, గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ లో అనసూయ మెస్మరైజ్ చేశారు.పొరల చాటు నుండి అనసూయ నడుము అందాలతో కవ్విస్తుండగా ఫోటోలు హాట్ అంటూ ఫ్యాన్స్ నోరెళ్ళ బెడుతున్నారు.ప్రదీప్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ ప్రమోషనల్ సాంగ్ లో అనసూయ నటించారు. నైట్ పబ్ సెటప్ లో ప్రదీప్ పక్కన అనసూయ స్టెప్స్ వేశారు.ఈ సాంగ్ లో రష్మీ, శ్రీముఖి సైతం పాల్గొనగా ముగ్గురు కలిసి ప్రదీప్ పక్కన మాస్ స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఈ సాంగ్ షూట్ కోసం అనసూయ హాట్ హాట్ గా తయారయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: