ఒకప్పటి కాలంలో హీరోలు తన క్రేజ్ తగ్గిందని భావిస్తే ఆ తర్వాత తండ్రి క్యారెక్టర్లు చేసేవారు. నెమ్మదిగా ఆ పాత్రల నుంచి కూడా వారు తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన వారు కూడా విలన్స్ గా రాణించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది హీరోలు ఈ మేరకు విలన్స్ గా నటించి మెప్పించారు కూడా. అలా ఒకప్పుడు హీరోలుగా నటించి ఇప్పుడు విలన్ గా మారిన నటులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

జె డి చక్రవర్తి : ఒకప్పుడు బొంబాయి ప్రియుడు, గులాబీ, ప్రేమకు వేళాయరా లాంటి ఎన్నో యూత్ ఫుల్ సినిమాల్లో హీరోగా నటించిన జేడీ చక్రవర్తి హోమం అనే మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఇది మాత్రమే కాక జోష్ మూవీలో కూడా మెయిన్ విలన్ గా నటించాడు.

శ్రీకాంత్ : 90వ దశకంలో ఆడవాళ్లకు కలల హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న శ్రీకాంత్ నాగ చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం అనే సినిమాలో విలన్ గా నటించాడు.

జగపతి బాబు : ఈయనకు కూడా ఆరోజుల్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. సినిమా అవకాశాలు తగ్గిపోయిన క్రమంలో ఆయన ముందుగా లెజెండ్ సినిమాలో తన విలనిజంతో జనాన్ని ఆకట్టుకున్నాడు. తర్వాత రంగస్థలంలో కూడా ఈయన విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

సుమన్ : 90లలో యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సుమన్ రజనీకాంత్ శివాజీ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అర్జున్ : యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన తెలుగులో లై, అభిమన్యుడు లాంటి సినిమాలతో విలన్ గా పరిచయం అయ్యాడు.

అరవింద స్వామి : మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాలో రొమాంటిక్ హీరో అనిపించుకున్న అరవింద స్వామి, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో తన విలనిజం పండించి చేశాడు.

మాధవన్ : సఖి సినిమాతో ఆ రోజుల్లో యువతుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మాధవన్ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: