సంపూర్ణేష్ బాబు కమెడియన్  కమ్ హీరో అని అందరికీ తెలుసు. సంపూర్ణేష్ బాబు మొదటగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టినప్పటికీ తను చేసే కామెడీతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సంపూర్ణేష్ బాబు చేసే ఏ సినిమా అయినా ఆయన కామెడీ ద్వారా హిట్ అవ్వాల్సిందే. అంతేకాకుండా ఆ కథలు  చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకు ఉదాహరణ హృదయ కాలేయం సినిమా. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఫుల్ కామెడీ తో నడుస్తుంది. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ సంపూర్ణేష్ బాబు కు మాత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు మరోసారి వినూత్నమైన సినిమా "బజార్ రౌడీ" తో మన ముందుకు రాబోతోన్న  విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. వసంత్  నాగేశ్వర రావు దర్శకత్వంలో బజార్ రౌడీ సినిమా తెరకెక్కుతోంది. సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్ గా కనిపించనుంది. గుంటూరులోని కొండవీడు ప్రకృతి అందాల మధ్య లో తాజాగా ఓ పాటను చిత్రీకరించారు.


అయితే ఇటీవల బజార్ రౌడీ సినిమాకు సంబంధించి ఒక సన్నివేశాన్ని చేయడం కోసం అందులో ఒక స్టంట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ స్టంట్ చేసేటప్పుడు అనుకోకుండా పైనుంచి బైక్ తో సహా కిందకి పడిపోయాడు సంపూర్ణేష్ బాబు. అయితే ఒక్కసారిగా సినిమా యూనిట్ అంతా ఉలిక్కిపడింది. ఇక ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబు గాయాలపాలయ్యాడు. ఇది చూసిన ఆ చిత్రం యూనిట్ హడావుడిగా దగ్గర్లో ఉన్న డాక్టర్ ను సంప్రదించగా ఏం కాలేదు అని డాక్టర్  చెప్పడంతో టీమ్ అంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది.


అయితే సినిమాలలో ఏవైనా స్టంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.  ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిత్రం యూనిట్ అంతా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వారితో స్టంట్స్ చేయిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: