ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అందులో కేవలం హీరో మంచి కథ ఉంటేనే సరిపోదు. గ్లామర్ కూడా తోడవ్వాలి. అలాంటి గ్లామర్ కోసం ఖచ్చితంగా ఎంతో అందమైన హాట్ గా హీరోయిన్లు కావాలి. హీరోయిన్ గ్లామర్ కూడా ఒక సినిమా హిట్ కి కీలక పాత్ర వహిస్తుంది. ఇక ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే   ఈ మధ్య కాలంలో సరైన హిట్టు కొట్టాలని కుర్ర హీరోలు భావిస్తున్నారు.. కథ పైన కాకుండా బాగా క్రేజ్ వున్న హాట్ హీరోయిన్స్  పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని  చెప్పాలి. ఆ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ తో సినిమా పై హైప్ రావడం గ్యారంటీ అని భావించి వాళ్లకు ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ చెల్లించి అయినా సరే.. వాళ్లనే ఎంపిక చేసుకోవాలంటూ దర్శకనిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలు ఆల్రెడీ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.మెయిన్ గా శ్రీనివాస్ సినిమాలో కచ్చితంగా క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ఉండాల్సిందే.

 ఇక అఖిల్ అయితే కెరీర్ ప్రారంభంలో కొత్త హీరోయిన్లతో పనిచేసాడు కానీ ఇప్పుడైతే క్రేజ్ లో ఉన్న హీరోయిన్లే కావాలంటున్నాడట.ఇక   ఇప్పుడు తాజగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోని వీళ్ళ రూట్ ని ఫాలో అవుతున్నాడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి.ఇతని నెక్ట్ సినిమాలో హీరోయిన్ గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసుకున్నారట. ఈ విషయంలో దర్శకనిర్మాతల పై ఆకాష్ పూరి కూడా ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది.దాదాపు ఈ హాట్ బ్యూటీ నే ఫైనల్ ఐపోయినట్టే అనే సమాచారం  బలంగా వినిపిస్తుంది.

‘ఉప్పెన’ ట్రైలర్ లో కృతి శెట్టిని చూసిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ సినిమాని చూస్తామా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకుండానే ఈ కుర్ర బ్యూటీ నాచురల్ స్టార్  నాని వంటి స్టార్ హీరో సినిమాలో కూడా ఎంపికయ్యింది. ఈమె క్రేజ్ ను గ్రహించి ఆకాష్ పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ హాట్ బ్యూటీ తో సినిమాలో నటించి మంచి హిట్ కొట్టాలని ఆకాష్ పూరి భావిస్తున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: