ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక డాన్స్ రియాలిటీ షో లో ఒక సాధారణ డాన్సర్ గా పరిచయం అయ్యి ఇప్పుడు ఒక గొప్ప యాంకర్ గా దూసుకుపోతున్నాడు. యాంకర్ లలో ఎక్కువ క్రేజ్ ఇంకా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రదీప్ యాంకరింగ్ చేసే షో అంటే చాలు ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యి టీఆర్పీ రేటింగ్ రావాల్సిందే అనే స్థాయికి ఎదిగాడు ప్రదీప్. ఇక ఎన్నో  రియాలిటీ షోలు టాక్ షోలు సినిమా ఈవెంట్స్.. అంటూ బిజీగా ఉండే ప్రదీప్ మొదటి సారి తన సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. "30రోజుల్లో ప్రేమించడం ఎలా?" అనే సినిమాతో ఈ యాంకర్ హీరోగా మారి ఇండస్ట్రీ లో అడుగు పెడుతున్న  విషయం తెలిసిందే. ఇది వరకే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ప్రదీప్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని మంచి స్టార్ హీరో అవ్వాలని ఆశపడుతున్నాడట.

ఇక అసలు విషయానికి వస్తే నిజానికి  ఈ సినిమాను గత ఏడాదే విడుదల చేయాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. సంక్రాంతికి తేవాలని అనుకున్నారు గాని పోటీ ఎక్కువగా ఉండడం వలన రిస్క్ చేయలేదు. ఇక మొత్తానికి ఈ జనవరి 29న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉంది.

అయితే ప్రదీప్ ఆ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రదీప్ "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" సినిమా  4 కోట్ల 4 లక్షలకు అమ్ముడు పొయ్యిందట. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 5 కోట్ల అయినా వసూలు చెయ్యాలి. ఇక ఐదు కోట్ల పైన ఈ సినిమా వసూళ్లు రాబడితే క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉందట. ఇక చూడాలి ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో.. ఎంత పెద్ద హిట్ అవుతుందో... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: