తెలుగులో హీరోయిన్ అనుష్క నట విశ్వరూపాన్ని పరిచయం చేసిన చిత్రం 'అరుంధతి'..ఈ సినిమా కంటే ముందు అనుష్కకు హీరోయిన్ గా ఓ మోస్తరు గుర్తింపు ఉండేది.. కానీ అరుంధతి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది స్వీటీ.. 2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హారర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ మూవీ.. అనుష్కను తిరుగులేని స్టార్గా నిలబెట్టింది.నిజానికి.. జేజమ్మ పాత్రలో మరో నటిని ఊహించుకోలేం అనే విధంగా నటించింది స్వీటీ..

ద్విపాత్రాభినయంతో తనకు తానే సాటి అనిపించుకుంది. అనుష్క పలికించిన ఆ రాజసం..నిజంగా గద్వాల్ మహారాణి దిగివచ్చిందా అన్నట్టుగా భ్రమింపజేసింది. అంతలా జీవించింది ఆ పాత్రలో..ఇక ఈ సినిమాకి గాను అనుష్క ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.. అయితే.. మొదట అరుంధతిగా అనుకున్నది అనుష్కను కాదట! అప్పట్లో సింగర్ కమ్ యాక్టర్ గా ఓ వెలుగు వెలిగిన మమతా మోహన్ దాస్ ను జేజమ్మగా అనుకున్నారట..దీనికి మమతా కూడా అంగీకరించినప్పటికీ.. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఖచ్చితంగా చేయాలని అనుకుంటే.. డేట్స్ అడ్జెస్ట్ చేయడం సాధ్యమయ్యేదే గానీ.. అరుంధతికి కేటాయించే బల్క్ డేట్స్ తో ఇతర చిత్రాలు రెండు మూడు చేయొచ్చు అనుకుందట మమతా.
 
దీంతో.. ఈ మూవీ స్వీటీ వద్దకు చేరింది.సీన్ కట్ చేస్తే.. ఈ సినిమాతో టాలీవుడ్లో అన్ ఫర్ గెటబుల్ మైల్ స్టోన్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంది అనుష్క. ఈ విధంగా.. పలు సినిమాల విషయంలో ఇలా జరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉంటాం.. చాలా మంది నటీనటుల ఫేట్ కూడా ఒక్క సినిమాతోనే మారిపోతూ ఉంటుంది. మొత్తానికి అనుష్క అరుంధతి సినిమా వెనక ఇంత కథ నడిచిందన్నమాట.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: