ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ స్టార్ యశ్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్ర్భాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సలార్ అంటూ ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే దాని కన్నా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ప్రభాస్ సలార్ లుక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా చేసింది. కె.జి.ఎఫ్ సినిమాను ప్రశాంత్ నీల్ బంగారు గనుల్లో తీశాడు. చాప్టర్ 2 కూడా అక్కడే షూట్ చేసినట్టు ఉన్నారు. అయితే సలార్ మాత్రం బొగ్గు బనుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గోల్డ్ మైన్ బ్యాక్ డ్రాప్ తో కె.జి.ఎఫ్ రాగా కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ తో సలార్ వస్తుందని తెలుస్తుంది. సలార్ లో ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది.

కన్నడలో తప్ప మిగతా భాషల్లో పెద్దగా తెలియని యశ్ నే ఓ రేంజ్ ఎలివేషన్స్ సీన్స్ చూపించి సత్తా చాటిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ను ఇంకెలా చూపిస్తాడో చూడాలి. రాధే శ్యాం తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. 2021 ఎండింగ్ కల్లా సలార్ రిలీజ్ అంటున్నారు. అది కుదరకపోతే 2022 సంక్రాంతికి సినిమా వస్తుందని తెలుస్తుంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి: