రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా నుండి వచ్చిన టీజర్లు మెప్పించాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ మీద ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ను నిప్పుగా.. ఎన్.టి.ఆర్ ను నీరుగా ఇండికేట్ చేస్తూ జక్కన్న క్రియేటివిటీ చూపిస్తున్నాడు. సినిమా ఫస్ట్ గింప్స్ నుండి ఇదే ఫార్మెట్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ కూడా ఇద్దరు హీరోలు రేసులో పాల్గొన్న పిక్ షేర్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఇన్ స్టాగ్రాం లో ఆర్.ఆర్.ఆర్ డైరీస్ అంటూ ఓ స్పెషల్ షూటింగ్ వీడియో షేర్ చేశారు. .. ఫైర్ ఇన్ వాటర్ అంటూ చరణ్ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్న వీడియోని లీక్ చేశారు. ఇదంతా సినిమాపై అంచనాలు పెంచేందుకే అని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి సరికొత్త ప్లాన్స్ చేస్తున్నాడు. ఇదివరకు సినిమా షూటింగ్ అయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్, లీక్స్ రివీల్ చేయని రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు మాత్రం ప్లాన్ మార్చి ప్రతి అప్డేట్ లీక్ రూపంలో రివీల్ చేస్తున్నాడు.  

ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపంతో అదరగొట్టేస్తారని అంటున్నారు. సినిమాలో చరణ్ రామరాజుగా నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందా.. బాహుబలిని దాటేస్తుందా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పగలం.      
                                       

మరింత సమాచారం తెలుసుకోండి: