ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చటగా మూడోసారి సుకుమార్ డైరెక్షన్ లో "పుష్ప" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఊర మాస్ స్టోరీతో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు వున్నాయి.ఇక  రీసెంట్  గా విడుదల చేసిన  పోస్టర్ లో మాస్ యాక్షన్ లుక్ లో రఫ్ లుక్ లో రెచ్చిపోతున్నాడు బన్నీ. ఈ పోస్టర్ చూసినవాళ్లంతా బన్నీ బాడీలాంగ్వేజ్ కి, రగ్డ్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు.

మాసిన జుట్టు, మట్టికొట్టుకుపోయిన కాళ్లు, చేతిలో గొడ్డలి, కళ్లల్లో కసి, మెడలో కండువా, నరికిన చెట్టుపైన కూర్చున్న స్టైల్, చుట్టూ ఉన్న కూలీలు ఇలా చాలా ఇంట్రస్టింగ్ గా ఈ పోస్టర్ ని డిజైన్ చేసింది చిత్రయూనిట్. ఈ స్టిల్ తోనే ఆగష్టు 13వ తేదిన వస్తున్నట్లుగా ప్రకటించేశారు. ముందుగా ఎలాంటి పెద్ద సినిమాలు ఈ డేట్ కి ప్లాన్ చేస్కోవద్దు అంటూ హింట్స్ ఇచ్చేశారు. అయితే హఠాత్తుగా రిలీజ్ డేట్ ఎందుకు పుష్ప టీమ్ ప్రకటించింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.హఠాత్తుగా పోస్టర్ ని రిలీజ్ చేసి ఉండచ్చని అంచనాలు వేస్తున్నారు సినీ తమ్ముళ్లు.

 మొత్తానికి రఫ్ అండ్ టఫ్ లుక్ లో బన్నీ పుష్ప రాజ్ గా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ చూసినవాళ్లంతా బన్నీ లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు. ఏం లుక్ ఇచ్చాడ్రా బాబూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ బాడీ లాంగ్వేజ్ కి హ్యాట్సాఫ్  అంటున్నారు. ఒక పక్క ఈ సినిమా కనుక హిట్ టాక్ సాధిస్తే బాహుబలి రికార్డులని బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: