ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఇప్పటికీ సరైన టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. త్రివిక్రమ్ తన సినిమాల్లో ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. 

మరీ ముఖ్యంగా విలన్ విషయానికి వస్తే ఎప్పుడూ విభిన్నంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు త్రివిక్రమ్. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఎన్టీఆర్ కాంబో కోసం త్రివిక్రమ్ విజయ్ సేతుపతిని విలన్ పాత్రలో నటింప చేయడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో విలన్ పాత్ర హీరోతో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంటుందట దానికి విజయ్ సేతుపతి అయితేనే కరెక్ట్ గా నప్పుతాడని త్రివిక్రమ్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి కూడా ఇప్పటికే ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. 

అదీ కాక విజయ్ సేతుపతితో సినిమా చేసే తమిళ్ లో కూడా మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమా కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్న తరుణంలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే మరి ఈ పాత్ర చేస్తానని విజయ్ సేతుపతి ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక బాలీవుడ్ భామ నటిస్తుందని ప్రచారం జరిగినా అది నిజం కాదని అంటున్నారు. ఆ మధ్య కాలంలో ఓ బాలీవుడ్ భామ ఎన్టీఆర్ అనే అక్షరాలు ఉన్న ఒక కాంపౌండ్ లోకి వెళుతూ దాన్ని వీడియో తీసి పెట్టగా ఆమె ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది అంటూ ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: