బాల్యం అనేది ఒక మధుర జ్ఞాపకం. బాల్య వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెద్దగా అవుదామా అని అనుకుంటాము.. కానీ ఒక్కసారి పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది బాల్యం ఎంత బాగుందో.. సరిగ్గా మన బాల్యాన్ని కళ్లకు కట్టేలా చూపించాయి కొన్ని సినిమాలు.. అయితే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. సిసింద్రీ :
టీవీ లో ఎన్ని సార్లు చూసినా తనివితీరదు.. అంత బాగుటుంది ఈ సినిమా..నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్. తరాలు మారినా మన బాల్యాన్ని తిరిగి గుర్తుకు వచ్చేలా చేస్తుంది.1995 లో విడుదలైన ఈ సినిమాను శివ నాగేశ్వర్ రావు డైరెక్ట్ చేశారు.

2. అంజలి :
బేబీ షామిలీ, తరుణ్ లను హైలెట్ చేస్తూ, హైపర్ కిడ్స్ గా ప్రెజెంట్ చేస్తూ మణిరత్నం తీసిన ఈ సినిమా మన చైల్డ్ వుడ్ మెమరీ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది.

3. లిటిల్ సోల్డర్స్ :
ఆమ్ ఏ వెరీ గుడ్ గర్ల్  అంటూ బేబీ కావ్య చేసే హడావిడి అంత ఇంత కాదు. క్రైమ్ & సస్పెన్స్ లకు కామెడీ జోడించి గుణ్ణం గంగరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా మన బాల్య జ్ఞాపకాలలో ఒకటి.

4. పాపం పసివాడు:
దక్షిణ ఆఫ్రికా సినిమా అయినా లాస్ట్ ఇన్ ది డిజర్ట్  అనే సినిమాను రీమేక్ చేస్తూ తెలుగులో వి.రామచంద్రరావు 1972లో పాపం పసివాడు అనే పేరుతో ఈ సినిమాలు తీశారు. ఎడారిలో ఆ బాబు కష్టాలు "అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి " అనే పాట మనల్ని కంటతడి పెట్టిస్తుంది. ఇక ఆ బాబు పాత్రలో సుజాత నటించి చక్కని పేరు తీసుకొచ్చింది.

5. బాల రామాయణం :
జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన చిత్రం బాల రామాయణం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: