బాలయ్య బోయపాటి మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ మూవీని మే 28న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. ఇక ఈ మూవీకి గాడ్ ఫాదర్ అన్న టైటిల్ కూడా దాదాపుగా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా విషయంలో బాలయ్యకు, బోయపాటికి కూడా మంచి నమ్మకం ఉంది. ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూసినా బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ బిజినెస్ కూడా యమ జోరుగా సాగుతోంది. ఈ మూవీతో పాటుగా బాలయ్య లేటెస్ట్ అంగీకరించిన మరో సినిమా క్రాక్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో అంటున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీకి అన్నీ కరెక్ట్ గానే కుదురుతున్నాయి. బాలయ్య కోసం గోపీ పవర్ ఫుల్ స్టోరీ రాసి ఓకే అనిపించుకున్నాడుట. మే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు.
ఇక ఈ మూవీతో పాటుగా బాలయ్యతో సినిమాలు చేసేందుకు మరింతమంది డైరెక్టర్లు క్యూ కట్టడమే విశేషం. బాలయ్యతో సినిమా తీయడానికి సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ ఒక కధ పట్టుకుని రెడీగా ఉన్నారుట. బాలయ్య ఓకే అనాలి కానీ సినిమా తీస్తాను అంటున్నారుట. ఇక మరో వైపు చూస్తే యంగ్ డైరెక్టర్ సంతోష్ కూడా బలరామయ్య బరిలోకి దిగితే అన్న మూవీని తీయడానికి రెడీ అంటున్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు సినియర్ డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమా అంటున్నారు. మొత్తానికి బాలయ్య బాబు ఎవరికి ఓకే చెబుతాడో తెలియదు కానీ ఆయనకు ఇంత డిమాండ్ ఒక్కసారిగా రావడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు.