ఉదయ్ కిరణ్ అంటే అమాయకమైన నవ్వు కళ్ళ ముందు కనిపిస్తుంది. లవర్ బాయ్ అంటే ఉదయ్ కిరణ్ అనే  చెప్పాలి.  ఉదయ్ ని చూస్తే హీరో మన వాడే, పక్కింటి కుర్రాడే అనిపించక మానదు. ఇక ఉదయ్ తొలి రోజుల్లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు, ఉదయ్ నాటి సీనియర్ హీరోలకు కూడా ఒక దశలో పోటీ ఇచ్చాడు. తన సినిమా కలెక్షన్లతో దుమ్ము రేపాడు.

ఇంతలా ఉదయ్ ఎదగడానికి కారణం ఒకే ఒక చిత్రం. అదే ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమా. ఈ సినిమాను తేజా డైరెక్ట్ చేశాడు. ఆయన కెమెరా మాన్ గా అద్భుతాలు సృష్టించాడు. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ కి అదిరిపోయే ఇమేజ్ వచ్చింది. ఇపుడు అదే తేజా చిత్రం 1.1 అన్న టైటిల్ తో కొత్తగా సినిమాను చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించాడు.

ఈ మూవీకి మ్యూజిక్ మాత్రం చిత్రం సినిమాకు చేసిన ఆర్ పీ పట్నాయక్ చేస్తాడని వెల్లడించారు. మిగిలిన వివరాలు అయితే లేవు. కానీ ఈ మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని వినిపిస్తోంది. పైగా ఈ మూవీలో కొత్త ఆర్టిస్టులను తీసుకుంటారని టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే వెండి తెరకు మరో ఉదయ్ కిరణ్ దొరుకుతారా అన్న చర్చ కూడా ఉంది. ఉదయ్ కిరణ్ కి లైఫ్ ఇచ్చి కెరీర్ ని బంగారం చేసిన తేజా డిస్కవరీలో ఇంకో ఉదయ్ కిరణ్ పుట్టుకువస్తాడా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఈ మూవీకి చిత్రం అన్న టైటిల్ పెట్టడంతో అందరికీ ఉదయ్ కిరణ్ గుర్తుకువస్తున్నాడు. మరి తొందరలోనే ఎన్నో విషయాలు ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ చెబుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: