టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని ఫార్ములాలు ఉంటాయి ఆ ఫార్ములాలు ఆ దర్శకుడిని మరియు హీరోని విజయవంతం చేస్తుంటాయి. ఇది ఒకసారి గమనించండి  జూనియర్ ఎన్టీఆర్ వదిలేసినా సినిమాలను ఏ హీరో  చేసిన ఆ సినిమాలు  తప్పకుండ సూపర్ హిట్లు అవుతాయి ఇది ఒక ఫార్ములా. ఇది ఎన్టీఆర్ కి అయితే వర్కౌట్ అవలేదు కానీ అతడు వదిలేసినా సినిమాలు మిగతా హీరోలకి మాత్రం మంచి విజయాలను సాధించి పెట్టాయి. మరి ఎన్టీఆర్ వదిలేసినా ఆ సినిమాలు ఏంటి? ఆ సినిమాలు చేసిన ఇతర హీరోలు ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మొదటగా 'దిల్' సినిమా వినాయక్ దర్శకత్వం లో నితిన్ హీరోగా చేసిన చిత్రం.ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి మనకి తెలిసిందే. అయితే 'ఆది' సినిమా తర్వాత వినాయక్ ఎన్టీఆర్ తో దిల్ సినిమా చేద్దామని అనుకోగా ఎందుకో పక్కన పెట్టేసాడట. ఎన్టీఆర్ దిల్ చిత్రాన్ని పక్కన పెట్టడంతో నితిన్  రంగంలోకి వచ్చాడు. చేసిన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ లో హీరోగా ఎదిగిపోయాడు.

ఆలాగే అల్లు అర్జున్ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'ఆర్య' సుకుమార్ దర్శకుడిగా చేసిన మొదటి చిత్రం ఆర్య. ఈ సినిమాని ఎన్టీఆర్ వదులుకున్నాడు.ఇక టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర కథని మొదట అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ కి వినిపించారట కానీ వాళ్లిదరు రిజెక్ట్ చేయడంతో ఆ కథను రవితేజ తో చేసి తొలి సినిమాతోనే బోయపాటి హిట్ కొట్టారు.

ఇక మరో టాలీవుడ్ దర్శకుడైన సురేందర్ రెడ్డి మొదటి సినిమా అయిన  'అతనొక్కడే' కథను   ఎన్టీఆర్ కి చెప్పగా కుదరక ఆ సినిమాను కళ్యాణ్ రామ్ చేయడంతో మంచి హిట్ అయ్యింది. అలాగే రవితేజ కెరీర్ లో సూపర్  హిట్ అయిన చిత్రం 'కిక్' ఈ  సినిమాలో రవితేజ పాత్రని మొదటగా ఎన్టీఆర్  అనుకోగా ఆ పాత్ర కుదరక అయన సినిమాని వదులుకున్నారు. దీంతో రవితేజసినిమా చేయడంతో 'కిక్' చిత్రం రవితేజ కెరీర్ లోనే మంచి చిత్రం గా నిలిచింది.

వీటితో పాటు మహేష్ బాబు- కొరటాల 'శ్రీమంతుడు', వంశీ పైడిపెల్లి 'ఊపిరి' సినిమాలను కూడా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్నారు. ఇప్పటివరకు చూసిన సినిమాలన్ని  ఎంత పెద్ద విజయాలు సాధించాయో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ సినిమాలను ఎన్టీఆర్ గనుక చేసి ఉంటె ఎలా ఉండేదో. ఒకసారి ఆయా పాత్రల్లో ఎన్టీఆర్ ని ఊహించుకుంటే శ్రీమంతుడు సినిమా ఎన్టీఆర్ కి బాగా సూట్ అయ్యేదేమో, ఒక జనతా గ్యారేజ్ లాగా ఎన్టీఆర్ కి మంచి హిట్ దక్కేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: