చంద్రశేఖర్ ఏలేటి తొలిసారిగా తెరకెక్కించిన "ఐతే" సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ సినిమాకి కథ అందించినందుకు గాను ఆయనకు బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు కూడా లభించింది. రూ.1.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తొలి సినిమాతోనే చంద్రశేఖర్ ఏలేటి తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు సినిమాతో మరిన్ని అవార్డులను గెలుచుకొని స్టార్ డైరెక్టర్ అయ్యారు.

అటువంటి డైరెక్టర్ ప్రస్తుతం చెక్ అనే ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీలో దేశ ద్రోహం చేశాడన్న ఆరోపణలతో ఒక చెస్ ఆటగాడు కి ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ వ్యక్తి ఓ గొప్ప చెస్ ప్లేయర్ అని తెలిసిన పోలీసు అధికారులు అతన్ని చెస్ టోర్నమెంట్ లకు కూడా పంపిస్తారు. చెస్ ఆడుతున్న సమయంలో కూడా అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఐతే ఈ ఖైదీ తనకు న్యాయస్థానం విధించిన మరణశిక్ష నుంచి బయటపడగలుగుతాడా? చెస్ ఆటలో ఎత్తులు పై ఎత్తులు వేసినట్లు జైల్లో కూడా వ్యూహాత్మకంగా ఆలోచించి మరణ శిక్ష నుంచి తప్పించుకుంటాడా లేదా అనేది ఈ సినిమాలో చూపించవచ్చని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖర్ ఏలేటి చెక్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. 'అమెరికా దేశంలో ఉరిశిక్ష పడిన ఒక ఖైదీ జైల్లో చెస్ ఆట ఆడినట్టు నేను ఒకసారి చదివాను. ఆ క్షణం నుంచే చెక్ సినిమా స్టోరీ మొదలైంది. దాదాపు 80 శాతం సినిమా జైలు లోనే సాగుతుంది. ఈ సినిమాలో లాయర్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా భయస్తురాలు కానీ ఆ తర్వాత ధైర్యవంతురాలిగా మారుతుంది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ ది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీలకమైన  పాత్ర. ఆమె నితిన్ కి ప్రేమికురాలిగా నటించింది. నిజానికి నితిన్ తో రెండు మూడు సినిమాలు అనుకున్నాం కానీ చివరికి చెక్ సినిమాకే ఫిక్స్ అయ్యాం. వైవిధ్యమైన కథతో వస్తున్న చెక్ ఓ మంచి కమర్షియల్ మూవీ,' అని చంద్రశేఖర్ ఏలేటి చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: