ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి  ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేము. అలాగే ఇప్పుడు మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మహేష్ , పవన్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వస్తే బాగుండు అని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి ఒకే తెరపై నటిస్తే ఆ సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేము. అసలు నిజానికి  వీరిద్దరి కాంబో లో సినిమా గత ఎనిమిది సంవత్సరాల క్రితమే రావాల్సి ఉందట .  కానీ   ప్రముఖ  దర్శకుడు అయిన మెహర్ రమేష్ నే వీరిద్దరి కాంబో తో సినిమా తీయడానికి ఎప్పుడూ  ట్రై చేసాడట . ప్రభాస్ ‘బిల్లా సినిమా టైం లోనే వీరిద్దరిని పెట్టి మెహర్ రమేష్ సినిమా తీయాలనుకున్నాడు.


దర్శకుడు అయిన మెహర్ రమేష్ తో  పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబులు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు . అంతేకాదు మెహర్ రమేష్ పవన్ కు వరుసకు తమ్ముడు అవుతాడన్నా విషయం కూడా  మనకు తెలిసినదే.అలానే, సూపర్ స్టార్ మహేష్ కి మెహర్ బెస్ట్ ఫ్రెండ్.ఇప్పటికే మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలన్నీ మెహర్ నే చూసుకుంటాడట.



స్నేహ భావంతోనే అప్పట్లోనే  మెహర్ రమేష్ చెప్పిన స్టోరీ లైన్ ఇద్దరు సూపర్ స్టార్ లకు కనెక్ట్ అయిందట . ఇద్దరికి నచ్చి  ఇద్దరు పాజిటివ్ గా నే రెస్పాండ్ అయ్యారట. కానీ ఆ సమయంలోనే ఎన్టీఆర్ శక్తీ సినిమా, వెంకటేష్ షాడో సినిమాల రిజల్ట్ నెగటివ్ టాక్ వచ్చాక వీరి కాంబో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిందట . ఒకవేళ అప్పుడు అన్ని అనుకూలంగా ఉండినట్లయితే మన పవర్ అండ్ సూపర్ స్టార్ల కాంబినేషన్లో సినిమా ఎనిమిదేళ్ల క్రితమే వచ్చి ఉండేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: