తెలుగు ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేస్తూ తమకంటూ మంచి గుర్తింపు సాధించిన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాటతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు
ముమైత్ ఖాన్... అంతకు మందు ఈమె బాలీవుడ్‌తో పాటు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. తాజాగా ఈమె ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన తండ్రి, తల్లి గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన ముమైత్ ఖాన్.. తల్లిది తమిళనాడులోని చెన్నై అయితే.. తండ్రిది మాత్రం పాకిస్థాన్ అని చెప్పుకొచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి వాళ్ల కుటుంబం భారతదేశానికి వలస వచ్చారట. అప్పటి నుంచి ఇక్కడే సెటిలయ్యారు. ఇక వాళ్ల అమ్మా, నాన్నలు కూడ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది ముమైత్ ఖాన్.పాకిస్థాన్‌లో ఇంకా ముమైత్ ఖాన్‌కు తండ్రికి సంబంధించిన చుట్టాలున్నారని చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా, భోజ్‌పురితో పాటు పలు భాషల్లో ఐటెం సాంగ్స్‌ చేసింది. తెలుగులో ఈమె ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 1లో ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తిక్కా సినిమా జరుగుతున్న టైం లో తను ఒక రోజు ఇంట్లో స్నానం చేసి అద్దం ముందుకొచ్చి ఇప్పటికింకా నా వయసు పాటకి  డాన్స్ చేస్తుంటే ఫ్లోర్ మీద కాలు జారి కింద పడిపోయింది అప్పటికే తన పక్కనే ఉన్న బెడ్ తనకి తగలడం తో తను కొన్ని రోజులు కోమాలో ఉంది ఆ తర్వాత తను సర్జరీ చేయించుకుని మొత్తానికి మళ్ళి రికవరీ అయింది అందుకే ఆ టైంలో తను చాలా సన్నగా అయ్యానని ఈమధ్య చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకుచ్చింది... ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: