టాలీవుడ్ లో తల్లి, అక్క, భార్య లాంటి పాత్రల్లో నటించి అలరించిన వారిలో సురేఖ వాని ఒకరు . ఎన్నో సినిమాల్లో సురేఖ వాని బ్రహ్మానందం కు భార్యగా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాల్లో బ్రహ్మానందం తో కలిసి కామెడీని పండించడంలో కూడా సురేఖ వాని సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు మాజీ హీరోయిన్ లే సినిమాల్లో క్యారెక్టర్ లు చేయడంతో సురేఖ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గిపోయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గిపోలేదు. ఇక ఈమె విషయం పక్కన పెడితే సురేఖ కూతురు సుప్రీత నాయుడు కూడా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు , వీడియోలతో సెలబ్రెటీ అయ్యింది. దాంతో సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువే. ఇక తల్లీ కూతుళ్లు చేసిన వీడియోలకు అక్కా చెల్లెళ్ళ లాగే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతూ ఉంటారు .

అంతే కాకుండా సుప్రీత నాయుడు ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ల రేంజ్ లో పొట్టి బట్టలతో పోజులు ఇస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.
సురేఖ వాని కూడా ఏం తక్కువ కాదు తన కూతురు సుప్రీతకు పోటీ ఇచ్చేలా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ షాక్ ఇస్తుంది. ఇది ఇలా ఉండగా..ఇప్పుడు సుప్రీత టాలివుడ్ ఎంట్రీ కి అంతా సిద్ధమవుతుందట. అది కూడా సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందట. ఒక బడా హీరో..బడా డైరెక్టర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతునట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో హీరోలు..హీరోయిన్ లు ప్రొడ్యూసర్ ల కొడుకులు, కూతుళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్ కానీ ఇప్పుడు సురేఖ వాని కూతురు కొత్త ట్రెండ్ ను తీసుకువస్తుందేమో .

మరింత సమాచారం తెలుసుకోండి: