పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ ప్రతిష్టాత్మక సినిమా వకీల్ సాబ్. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, అనన్య, ప్రకాష్ రాజ్, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఇటీవల షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ అలానే మగువా ఓ మగువా అనే సాంగ్ రెండు కూడా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ సంపాదించి మూవీపై భారీస్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. నిజానికి గత ఏడాది మధ్యలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడింది.

అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంటుందని ముఖ్యంగా ఒరిజినల్ హిందీ మాతృకని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. దాదాపుగా మూడున్నరెళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తప్పనిసరిగా ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకని టాలీవుడ్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేయడం ఖాయమని పలువురు పవర్ స్టార్ ఫాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. పేరు గుర్తుందిగా సాబ్, వకీల్ సాబ్ రేపు రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం అంటూ మరి కొందరు సరదాగా కామెంట్ చేస్తుండడం విశేషం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: