ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీ గా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ ఇందులో కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. స్వతంత్రోద్యమానికి ముందు జరిగిన కథగా యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ ప్రకటన ఇటీవల రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ అది కంప్లీట్ చేసుకొని వచ్చిన వెంటనే తన సినిమా షూటింగ్ మొదలెట్టేలా ప్లాన్ చేశారట త్రివిక్రమ్.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కథ తో పాటు పూర్తి స్క్రిప్టు పక్కాగా సిద్ధమైందని అలానే ఈ మూవీ కోసం మరోవైపు రెండు భారీ సెట్టింగులు కూడా యూనిట్ సిద్ధం చేసిందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి మూడో వారంలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో ఎన్టీఆర్ పాత్రని అత్యద్భుతంగా తీర్చిదిద్దారట దర్శకుడు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత ని మించేలా ఈ మూవీ తెరకెక్కనుందని అలానే యువ సంగీత తరంగం థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడని అంటున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక బాలీవుడ్ భామ నటించనున్నట్లు సమాచారం.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: