విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి పెద్ద సక్సెస్ ను అందుకొని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీ తో విజయ్ దేవరకొండ స్టార్ మారిపోయింది. విజయ్ పూర్తి పేరు విజయ్ సాయి దేవరకొండ. విజయ్ దేవరకొండ కు మొదటి సినిమా అవకాశం 2011లో నువ్విలా సినిమా ద్వారా లభించింది . తర్వాత మంచి మంచి సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం మూవీ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది.


సెన్సెషనల్  హీరో విజయ్ దేవరకొండతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.


 విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్ లో ప్రస్తుతం  రమకృష్ణ పాల్గొంటోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం రమ్యకృష్ణ ఊహించని  లుక్ లోకి మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ షూటింగ్  లో తీసుకున్న ఫోటోలు రమ్యకృష్ణ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. బెస్త వారి లుక్ లో రమకృష్ణ కనిపించారు. ఇక ఈ ఫోటో చూసిన తన అభిమానులు షాక్ కి గురవుతున్నారు.


 సాధారణంగా పూరి జగన్నాథ్ తల్లి పాత్రలను బలంగా రాస్తుంటారు. అమ్మానాన్న తమిళ అమ్మాయి, లోఫర్ చిత్రాల్లో తల్లి పాత్రలకు  మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పుడు లైగర్ లోను రమ్యకృష్ణ పాత్ర గుర్తిండిపోయే విధంగా పూరి కథలు రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా  ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆమె నటిస్తోంది.


 ప్రస్తుతం విజయ్ దేవరకొండ  లైగర్ సినిమాలో రోహిత్ రాయ్,అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  పూరి కనెక్ట్ ధర్మా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం, హిందీ,భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 2019లో ఇస్మార్ట్శంకర్ విజయం తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: